‘రోజు’కు రూ.17…మోదీజీ ఐదేళ్ల పాలనలో ‘రైతు’ల ‘వ్యధ’ !
‘రోజు’కు రూ.17…మోదీజీ ఐదేళ్ల పాలనలో ‘రైతు’ల ‘వ్యధ’ :
ఎన్నికలకు ముందు…చివరి బడ్జెట్‌లో ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి‘ పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం చేయనున్నట్లు ‘కేంద్రమంత్రి పీయూష్ గోయల్‘ తెలిపారు.

మోదీజీ ఐదేళ్ల పాలనలో ‘రైతు’ల ‘వ్యధ’
అయితే ఈ పథకంపై రాహుల్ తో పాటు పలువురు నేతలు పెదవి విరిచారు.ఈ పథకం ద్వారా రైతులను అవమానానికి గురిచేయడమేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల జీవితాలను మోదీ సర్కారు నాశనం చేసిందని ఆరోపించారు.
బడ్జెట్‌పై రాహుల్ స్పందిస్తూ… ‘డియర్ నరేంద్ర మోదీ. ఐదేళ్ల మీ అసమర్థత, అహంకారం రైతుల జీవితాలను నాశనం చేసింది.

రైతులకు రోజుకు రూ.17
రైతులకు రోజుకు రూ.17 ఇవ్వడమంటే వారిని పూర్తిగా అవమానించడమే’ అని పేర్కొన్నారు. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో రూ.6000 చెల్లించనున్నట్లు.. నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
ఈ పథకంతో 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. దాదాపుగా రూ.75 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయనుంది.
Read Also: https://www.legandarywood.com