Govt Job Preparation Tips: ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
తెలంగాణ (Telangana)లో ప్రభుత్వం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టెట్ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష తేదీలు కూడా వెలువడ్డాయి. కేసీఆర్ సర్కార్ (TRS Government)ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేసింది. నియామకాలకు (Jobs) సంబంధించి గరిష్ఠ వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ఠ వయో పరిమితిని పదేళ్ల పాటు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం ఇప్పటి వరకు గరిష్ట వయో పరిమితి 34 ఏళ్లు ఉండగా.. తాజా ఉత్తర్వులతో అది 44 ఏళ్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ (Prepare) అయ్యే వారు పాటించాల్సిన టిప్స్ తెలుసుకోండి..
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
1. మీరు ముందుగా ఏ ఉద్యోగాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రిపేర్ అవుతున్నారో నిర్ణయం తీసుకోవాలి.
2. అన్నింటికి సెలబస్ ఒకేలా ఉన్నా.. మీ లక్ష్యం ఒక్కటే ఉండాలి. పరీక్షలు అర్హత ఉన్నవన్ని రాయండి. కానీ మీ జాబ్ గోల్ ఒక్కటే ఉండాలి.
3. ఆ ఉద్యోగానికి సంబంధించిన సిలబస్‌ను పూర్తిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ సిలబస్‌పై పట్టు సాధించాలి. ఆ సిలబస్‌కు తగ్గట్టుగా సరైన పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి.
4. తర్వాత మీ అనుకూలతను బట్టి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ప్రముఖ కోచింగ్ సెంటర్ల గురించి తెలుసుకోవాలి. ఎటువంటి కోచింగ్ తీసుకోవాలి అనే దాని గురించి మొదట స్పష్టమైన అవగాహన ఉండాలి. కోచింగ్ తీసుకోకున్నా గట్టగా చదివితే ఉద్యగం మీ సొంతం.
5. అన్నింటికన్నా ముఖ్యమైంది టైం టేబుల్.. టైం టేబుల్‌కు సంబంధి సూచనలు ఇవే.
డైలీ టైం టేబుల్ ఫార్మాట్ మీ కోసం
– ఉదయం 5:00 గంటలకు లేచి మీ రోజును ప్రారంభించండి.
– ఉదయం 5:15 నుంచి 6:15 వరకు- యోగా, వ్యాయామం లేదా వాకింగ్ వంటి శారీరక వ్యాయామం, ధ్యానం చేయండి.
– ఉదయం 6:30లోపు కాలకృత్యాలు, స్నానం పూర్తి చేయండి.
– ఉదయం 6:30 నుంచి 7:30 వరకు- ముందు రోజు కవర్ చేసిన అంశాలను రివిజన్ చేసుకోండి.
– ఉదయం 7:30 నుంచి 8:00 వరకు బ్రేక్‌ఫాస్ చేయండి. ఆ తర్వాత వార్తాపత్రిక చదవండి.
– ఉదయం 8:00 నుంచి 10:30 వరకు- అత్యంత సంక్లిష్టమైన టాపిక్స్‌పై అధ్యయనం చేయండి.
– ఉదయం 10:30 నుంచి 11:30 వరకు విశ్రాంతి తీసుకోండి.
– ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు- ఈ రోజు మీరు కవర్ చేయాల్సిన టాపిక్‌పై దృష్టి పెట్టండి.
– మధ్యాహ్నం 1:00 నుంచి 1:00 గంటలకు భోజన విరామం తీసుకోండి.
– మధ్యాహ్నం 1:30. నుంచి 4:00 వరకు రెండు గంటల పాటు చదువుకోండి.
– ఆ తర్వాత 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.
– సాయంత్రం 4:00. సాయంత్రం 4:30 వరకు విరామం తీసుకోండి. సాయంత్రం కుదిరితే కాసేపు వ్యాయామం చేయండి.
– సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన వారి టిప్స్ ఉన్న ఇంటర్వ్యూ (Interview) లు చూడండి అందులో మీకు ఉపయోగపడే టాపిక్స్‌పై దృష్టి పెట్టండి.