అమృత ఫలంలో.. కాలకూట విషం !

అమృత ఫలంలో.. కాలకూట విషం:

‘మామిడి’ పండు పరిచయం అక్కర్లేని అమృత ‘ఫలం’. వేసవిలో వచ్చే ఈ ఫలం కోసం చిన్న..పెద్ద అని తేడా లేకుండా ఎదురు చూస్తారనటం అతిశయోక్తికాదు. కానీ వ్యాపారుల అతివల్ల స్వదేశీ ఫలం కంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫలానిదే గిరాకీ.

అమృత ఫలంలో.. కాలకూట విషం

అమృత ఫలంలో.. కాలకూట విషం

 

కృత్రిమ పద్ధతికి అలవాటు పడిన వ్యాపారులు హైకోర్టు ఉత్తర్వులను ‘కాలుష్యకారక కార్బైడ్‌ నిషేధించాలని’…. పెడచెవిన పెట్టి త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు, కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న ‘ఇథిలిన్‌’ పౌడర్‌ను వినియోగిస్తున్నారు.

దీనికి అనుమతి లేకపోయినా కాయలను 24 గంటల్లో నిగనిగలాడే పండ్లుగా మార్చేందుకు ఆపౌడర్‌ను దొడ్డిదారిన వినియోగిస్తున్నారు. పౌడర్‌ను 5 ఎంఎల్‌ ప్యాకెట్లుగా తయారు చేసి, ఒక్కో బాక్స్‌ (15 నుంచి 35 కిలోల మామిడికాయల పెట్టె)లో నీళ్లలో ముంచి మూడు నుంచి ఐదు ప్యాకెట్లు వేస్తున్నారు. తమకు అనుమతి ఉందని వ్యాపారులు పేర్కొనటం కొసమెరుపు.

 

Hidden poison

Hidden poison

మామిడి కాయలను సహజసిద్ధంగా బట్టీలలో పక్వానికి తెచ్చే పద్ధతులు పాటించేవారు. ఇలా మగ్గించటానికి కనీసం 90 నుంచి 96 గంటల సమయం పడుతుంది. ఆ మధుర తీపి ప్రజలు ఆస్వాదించేవారు. కృతిమ పద్ధతులు, రసాయనాలతో మగ్గించడం వల్ల రుచిలో తేడాలొస్తున్నాయి.

ఇంత సమయం దాకా ఆగలేని వ్యాపారులు కాల్షియం కార్బైడ్, ఇథిలిన్‌ పౌడర్‌లాంటి మార్గాలను అనుసరిస్తున్నారు. వీటి ద్వారా 24 నుంచి 48 గంటల్లోపే కాయలు పండ్లుగా మారుతున్నాయి. గడ్డిఅన్నారం మార్కెట్‌లో సుమారు 200 నుంచి 300 మంది మహిళలు, బాల కార్మికులు, హమాలీలు ఇథిలిన్‌ పౌడర్‌ ప్యాకింగ్‌ నిమిత్తం పని చేస్తారు.

వ్యాపారుల లాభాలేమో కానీ.. వారి దయవల్ల ప్రజలు ‘అనారోగ్యం’ అనే అనుకోని ‘అతిథి’ని ఆహ్వానిస్తున్నారు.

 

Read Also: https://www.legandarywood.com/

 

About the Author

Leave a Reply

*