అన్ని ఎలా మిస్ చేసుకున్నావ్ రాజా !!!

అన్ని ఎలా మిస్ చేసుకున్నావ్ రాజా :

 

అన్ని ఎలా మిస్ చేసుకున్నావ్ రాజా

అన్ని ఎలా మిస్ చేసుకున్నావ్ రాజా

 

పీఎస్వీ గరుడవేగ మూవీకి సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత.. సీనియర్ హీరో రాజశేఖర్ లో ఉత్సాహం ఉరకలు వేస్తున్న సంగతి తెలిసిందే. తమకు ఎవరూ లేరని అనుకున్నామని.. ఇండస్ట్రీలో ఇంతమంది సపోర్ట్ రావడం ఆనందంగా ఉందని జీవిత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రాజశేఖర్ అయితే.. తన దగ్గరకు వచ్చిన ఆఫర్స్ చిట్టాను.. తను గతంలో చేయాలని అనుకున్న కేరక్టర్స్ ను డీటైల్డ్ గా చెప్పేస్తున్నాడు. రామ్ చరణ్ మూవీ ధృవలో అరవింద్ స్వామి పాత్రను చేస్తానంటూ.. చిరంజీవిని తానే అప్రోచ్ అయినట్లుగా రాజశేఖర్ చెప్పాడు. అయితే.. ఈ రోల్ కు అరవింద్ స్వామినే కొనసాగించడంతో.. ఆ ఆఫర్ మిస్ అయింది.

‘త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో కూడా ఓ ఆఫర్ ను మిస్ చేసుకున్నాను. అల్లు అర్జున్ మూవీ సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర కేరక్టర్ కు మొదట నన్నే సంప్రదించారు. కానీ ఆ తర్వాత ఎలాంటి ఆఫర్ రాలేదు. దీంతో నేను కూడా సైలెంట్ అయిపోయాను. అంతే కాదు..మహేష్-వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో ప్రకాష్ రాజ్ పోషించిన తండ్రి పాత్ర చేయమని కూడా అడిగారు. పరిస్థితులు వర్కవుట్ కాకపోవడంతో నేనే తప్పుకోవాల్సి వచ్చింది’ అని చెప్పాడు రాజశేఖర్.

తాను మెప్పించగలిగే ఏ పాత్రను చేయడానికైనా.. ఆఖరికి విలన్ రోల్ అయినా చేసేందుకు రెడీ అంటున్న రాజశేఖర్.. ఇన్ని క్రేజీ ఆఫర్స్ ను ఎలా వదులుకున్నాడన్నదే అసలు పాయింట్. అయితే.. ఇక సైడ్ కేరక్టర్స్ చేసుకోక తప్పదని తనే దాదాపు ఫిక్స్ అయిపోతున్న తరుణంలో వచ్చిన గరుడవేగ సక్సెస్.. రాజశేఖర్ లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.

 

Read Also : http://www.legandarywood.com/anasuya-sets-fashion-goals/

About the Author

Leave a Reply

*