Hug job is better than all the Jobs !

కౌగిలింత ఉపాధి… లక్షల్లో వేతనం:

మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాలో చెప్పినట్టు… ఎవరైనా బాధలో ఉన్నప్పుడు… చిన్న కౌగిలింత వారిలోని దుఃఖాన్ని పోగొట్టి మనస్సుకు స్వాంతన చేకూరుతుంది. పరాయి దేశంలో ఇదే కాన్సెప్టుతో వ్యాపారం మొదలెట్టి కోట్ల సంపాదన ఆర్జిస్తున్నారు.

మనసుకు నచ్చిన వారితో మనవాళ్లు అనిపించుకునే స్నేహితులతో గడిపితే.. హృదయం పడుతున్న వేదన నుంచి విముక్తి దొరుకుతుందని చెబుతుంటారు. కానీ.. కొందరికి మనవాళ్లు అంటూ ఎవ్వరూ ఉండరు. ఒంటరిగానే జీవితం వెళ్లదీస్తుంటారు. కావాల్సినవాళ్లున్నా.. ఏదో కారణంతో విడిపోయినవారు కొందరైతే.. నిజంగానే ఎవ్వరూ లేనివారు మరికొందరు. ఇలాంటి వాళ్లకు ఓదార్పు కావాల్సి వస్తే.. వెళ్లి కౌగిలించుకొని వాళ్లను ఓదార్చి రావాలి.

ఈ ఉద్యోగాన్నే ప్రొఫెషనల్ కడ్లర్స్ అంటారు. ఇప్పుడు ఇది విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో మంచి జాబ్. ఒత్తిడి ఆందోళన ఇతరత్రా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు వీరిని సంప్రదిస్తే…

వెళ్లి కౌగిలించుకొని ఓదార్చి వస్తారు. అయితే.. ఇదంతా ఫ్రీగా కాదు. ఇందుకోసం భారీగా వసూల్ చేస్తారు. రాబిన్ స్టినె అనే మహిళ కౌగిలింతలో థెరపిస్ట్. ఈమె ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. ఈమె తరహాలోనే చాలా మంది ఇప్పుడు దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. బాధితులకు ఉపశమనం.. ఉద్యోగులకు ఉపాధి. భలే గమ్మత్తుగా ఉంది కాదు.

ఏది ఏమైనా… విదేశాల్లో వ్యాపారాలు ఏవైనా దానికి పునాది భారతదేశం.

About the Author

Leave a Reply

*