దేశంలో కోటీశ్వరులు ఎంత మంది ఉన్నారు?

దేశంలో కోటీశ్వరులు ఎంత మంది ఉన్నారు?

 

కోటీశ్వరులు ఎంత మంది ఉన్నారు?

కోటీశ్వరులు ఎంత మంది ఉన్నారు?

 

భారతీయుల ఆస్తి ఎంత?  దేశంలో కోటీశ్వరులు ఎంత మంది ఉన్నారు?  భారతీయుల ఆస్తిలో వారికున్న రుణభారం ఎంత శాతం?  దేశంలో జనాభా వృద్ధిరేటుకు.. సంపద వృద్ధిరేటుకు మధ్య సంబంధం ఎలా ఉంది?  భారత్ లో భారీ ఆదాయం (ఏడాదికి 10 కోట్ల డాలర్లు)కంటే ఎక్కువ ఉండే వారు ఎంత మంది?  లాంటి ఆసక్తికర సమాచారాన్ని చెప్పే నిఏదిక ఒకటి తాజాగా విడుదలైంది.

ప్రపంచ సంపదలో భారత్ భాగం ఎంతన్న విషయాన్ని చెప్పే ఈ లెక్క ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. భారత్ లో మొత్తం 2.45 లక్షల మంది కోటీశ్వరులు ఉన్నట్లుగా క్రెడిట్ స్విస్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. వారి విలువ 5 లక్షల కోట్ల డాలర్లుగా చెబుతున్నారు. 2022 నాటికి కోటీశ్వరుల సంఖ్య 3.72 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు.

గృహస్థుల ఆదాయంలో ఏటా 7.5 శాతం వృద్ధి నమోదు అవుతుందని.. ఈ నేపథ్యంలో 2022 నాటికి కోటీశ్వరుల సంఖ్య 3.72 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. 2000 నుంచి భారత్ లో సంపద ఏటా యావరేజ్ ను 9.9 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు. అంతర్జాతీయ సగటుతో పోలిస్తే భారత్ వృద్ధి రేటు భారీగాఉందని చెబుతున్నారు. ప్రపంచంలో ఈ తరహా వృద్ధి రేటు ఉన్న దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచినట్లుగా వెల్లడైంది.

అంతర్జాతీయ సగటు 6 శాతం అయితే.. భారత్ మాత్రం 9.9 శాతంగా ఉండటం గమనార్హం. అదే సమయంలో భారత్ జనాభా వృద్ధిరేటు 2.2 శాతం ఉందని చెబుతున్నారు. దేశంలో ప్రజల సంపద పెరుగుతున్నప్పటికీ అందరిలోనూ కాకుండా కొందరి ఆస్తులు మాత్రమే విపరీతంగా పెరిగినట్లుగా పేర్కొంది. 6.5 లక్షల కంటే తక్కువ సంపద ఉన్న వారుపెద్ద సంఖ్యలో ఉన్నట్లుగా సదరు నివేదిక వెల్లడించింది.

భారత్ లో వ్యక్తిగత సంపదలో స్థిరాస్థులు ఎక్కువగా పేర్కొంది. భారత ప్రజల రుణభారం వారి ఆస్తుల విలువలో 9 శాతం మేర ఉందని.. ఇది పలు సంపన్న దేశాల ప్రజల రుణభారంతోపోలిస్తే మనది తక్కువగా చెబుతున్నారు. ధనిక.. పేద మధ్య తారతమ్యాలు ఎక్కువగానే ఉన్నా.. దేశ ప్రజలు వృద్ధి దిశగా పయనిస్తున్నారన్న పాజిటివ్ కోణాన్ని నివేదిక స్పష్టం చేస్తుందని చెప్పాలి. 

 

Read Also  : http://www.legandarywood.com/wears-trendy-outfit-go-crazy-hansika-motwani/

About the Author

Related Posts

Leave a Reply

*