‘అర్జున్ రెడ్డి’తో ‘జాన్వీ’ కపూర్ ‘రొమాన్స్’ !
‘అర్జున్ రెడ్డి’తో ‘జాన్వీ’ కపూర్ ‘రొమాన్స్’ :
స్టార్ హీరో ‘విక్రమ్’ తనయుడు ‘ధృవ్’ డెబ్యూ సినిమా ‘వర్మ’ విక్రమ్‌కు నచ్చలేదా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. అలాగే ఈ నేపథ్యంలో డైరెక్టర్ ‘బాల’ తోపాటు, హీరోయిన్ ‘మేఘ చౌదరి’ ని కూడా మార్చేస్తునట్లు వార్తలు వచ్చాయి.
ఈ సినిమా అవుట్ పుట్ నాసిరకంగా ఉందని, ఈ చిత్రం విడుదలైతే తన కొడుకు భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని ‘విక్రమ్’ భావించాడట.

‘అర్జున్ రెడ్డి’తో ‘జాన్వీ’ కపూర్
దీనితో నిర్మాతలతో మాట్లాడి విక్రమ్ ఈ చిత్రాన్ని రద్దు చేయించాడు. ఎంత నష్టమైనా నేను భరిస్తా.. సినిమాని మళ్ళీ కొత్తగా ప్రారంభించండి అని తెలిపాడు. ‘విక్రమ్’ మాట ప్రకారం నిర్మాతలు ఈ చిత్రాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా ఈ చిత్రాన్ని కొత్త హీరోయిన్, దర్శకుడి గురించి క్రేజీ న్యూస్ ప్రచారం జరుగుతోంది. మేఘ చౌదరి ప్లేసులో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తోందట. ఇది కనుక నిజమైనతే జాన్వీ కపూర్ సౌత్ లో అడుగుపెట్టేందుకు ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు.

క్రేజీ న్యూస్
అలాగే స్టార్ డైరెక్టర్ ‘గౌతమ్ వాసుదేవ్ మీనన్’ అర్జున్ రెడ్డి తమిళ ‘రీమేక్’ దర్శకత్వ భాద్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. వాసుదేవ్ మీనన్ స్టైలిష్ చిత్రాలు, ప్రేమ కథలు రూపొందించడంలో స్పెషలిస్ట్.
ప్రస్తుతం విక్రమ్ గౌతమ్ మీనన్ దర్శత్వంలోనే ‘ధ్రువ నక్షత్రం’ చిత్రంలో నటిస్తున్నాడు, విక్రమే ఆయన్ని తన కొడుకు చిత్రానికి దర్శత్వం వహించాలని రిక్వస్ట్ చేసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుందని ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్.
Read Also: https://www.legandarywood.com