యూరోప్ దేశంలో కరోనా విలయం !

యూరోప్ దేశంలో కరోనా విలయం :
యూరోప్ దేశాల్లో కరోనా విలయ తాండవం కొనసాగుతుంది… ఎంతలా అంటే పుడుతున్న వారి కంటే మృత్యువాత పడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అంటే దాదాపు పది లక్షల మైలు రాయి దాటింది. వైరస్ నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నా.. ఆ దేశాల్లో మాత్రం వైరస్ విజృంభణ కొనసాగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) వెల్లడించింది.

యూరో యూనియన్ లో ఉన్న మొత్తం దేశాల్లో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 10,00,288 మంది మరణించారు. కరోనా విషయంలో కీలక దశలో ఉన్నామని W.H.O టెక్నికల్ లీడ్ మారియా వన్ ఖేరెఖోవో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఇప్పటికే 29 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 13.6 కోట్ల మందికి వైరస్ సంక్రమించింది.

కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా… ప్రమాదకరంగా కొనసాగుతుందని.. ప్రజలు అప్రమత్తతతో మెలగాలని అధికారకంగా వెల్లడించారు.

About the Author

Leave a Reply

*