వాక్సిన్ ఉన్నా….ఇండియాలో కరోనా కల్లోలం !

వాక్సిన్ అందుబాటులో ఉన్నా….ఇండియాలో కరోనా కల్లోలం:
ఇండియాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి… మళ్ళీ విజృంభిస్తున్నాయి. రోజువారీ విడుదల చేస్తున్న రిపోర్టుల్లోనూ…. కొద్ది రోజులుగా మరణాల సంఖ్య ఎక్కువ అవుతోంది. దీంతో.. మార్చురీలు నిండిపోతున్నాయి. పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్న మరణాలు.. ఎంతలాఅంటే వచ్చే శవాలు కూడా ఆసుపత్రుల్లో స్థలం లేనంత.. ఇలాంటి సంఘటన ఛత్తీస్ గఢ్ రాయ్ పుర్ లో వెలుగులోకి వచ్చింది. శవాల్ని మార్చురీ నిండిపోవటంతో.. సంచుల్లో కుట్టేసి.. ఆసుపత్రి ఆరు బయట ఉంచుతున్నారు.

రాయ్ ఫుర్ లోని అతి పెద్ద ఆసుపత్రి అయిన డాక్టర్ భీమ్ రావు అంబేడ్కర్ స్మారక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న కేసుల్లో మరణాలు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. దీంతో.. గతంలో ఎప్పుడూ లేనంత భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నట్లు చెబుతుున్నారు. రోజువారీగా చోటు చేసుకునే మరణాలు ఎక్కువగా ఉండటంతో మార్చురీలు సరిపోవటం లేదు.

దీంతో.. శవాల్ని ఎక్కడ ఉంచాలో అర్థం కాని పరిస్థితి. ఫ్రీజర్లు సరిపోని దుస్థితి. శ్మశాన వాటికలు సరిపోవటం లేదు. అంత్యక్రియకుల వెళుతున్న వాటి కంటే.. ఎక్కువ మార్చురీకి వస్తున్నాయి. దీంతో.. అంత్యక్రియులు చేయలేని పరిస్థితి నెలకొంది. మరింత దారుణమైన విషయం ఏమంటే.. శవాల్ని మార్చురీ నిండిపోవటంతో.. సంచుల్లో కుట్టేసి.. ఆసుపత్రి ఆరు బయట ఉంచుతున్నారు. తమకు ఏం చేయాలో అర్థం కావటం లేదని.. భారీగా చోటు చేసుకుంటున్న మరణాలతో ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లుగా ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ పేర్కొంది.
చూస్తుంటే.. కరోనా మహమ్మారి రోజు రోజుకు చాప కింద నీరులా విజృంభించి… తాను ఏమాత్రం బలహీనపడలేదని… తెలుస్తుంది.

About the Author

Leave a Reply

*