Karona teaches @can do business any where !
కాసుల కక్కుర్తి స్మశానాలకు విస్తరణ:
కరోనా మహమ్మారి పుణ్యమాని సేవ చేయటం మరిచి.. అధికారులు | కార్పొరేట్ ఆసుపత్రులు | రక్షక భటులు ఇత్యాది వారిని మించి దోచుకోవటంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు… అవి ఎక్కడో కాదు శాశ్వత నివాసాలకు ఆలవాలమైన స్మశాన వాటికలలో..
తమ వారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నా… ఇంతియాల్సిందే అంటూ ముక్కు పిండి వాసులు చేస్తున్నారు… కొంతమంది శ్మశాన వాటికల వాళ్లు… కాసులు దండుకొనే వారికి చెక్ పెట్టాలని జీహెచ్ఎంసీ భావించింది.
అంతిమ సంస్కారానికి గరిష్టంగా రూ. 8 వేలు మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. ఎలక్ట్రిక్ దహనం అయితే రూ.4000లు చెల్లించాలని సూచిస్తున్నది. అంతేగాకుండా..పలు శ్మశాన వాటికల్లో ధరల పట్టికల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. కొంతమంది కాటికాపరులు రూ. 12 వేల నుంచి రూ. 16 వేల వరకు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం..జోనల్ కమీషనర్లు అకస్మిక పర్యటనలు చేసి దహన సంస్కారాలకు సంబంధించి..ఛార్జీల పట్టికలను ఏర్పాటు చేశారు. కాటికాపరులకు బిల్లు బుక్కులు అందచేశారు. అధిక ఛార్జీలు వసూలు చేసినా..ఇతర ఫిర్యాదుల కోసం 040-2111 1111 కు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు సూచించారు.
నేటి భారత జీవన విధానం… చేసే ప్రతి పని వ్యాపార ధోరణిలో భాగం అయిపొయింది.