‘షేన్‌వార్న్’ లా ‘కుల్‌దీప్ యాదవ్’ !
‘షేన్‌వార్న్’ లా ‘కుల్‌దీప్ యాదవ్’:
ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ ‘షేన్‌వార్న్’ తరహాలో ‘కుల్‌దీప్ యాదవ్’ బంతిని డ్రిఫ్ట్ చేయడంతో కుల్‌దీప్ ‘బౌలింగ్’ను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని ఒకప్పటి విధ్వంసక వీరుడు ‘మాథ్యూ హెడేన్’ అన్నారు.
కుల్‌దీప్‌ను చూస్తే బంతిని ఎంత తిప్పుతాడన్నది అతడి బలం కాదు. షేన్‌వార్న్ తరహాలో బంతి బ్యాట్స్‌మెన్‌ను ఎలా చేరుకుంటుందన్నదే బలం.

‘షేన్‌వార్న్’ లా ‘కుల్‌దీప్ యాదవ్’
వీరి బంతులు గాల్లో వంపు తిరుగుతాయి. ఇక చాహల్ భిన్నమైన బౌలర్. స్టంప్ టు స్టంప్ విసురుతాడు. బంతిని చాలా ఫ్లాట్‌గా, నేరుగా వేస్తాడు. డ్రిఫ్ట్ చేయడు. ఒక ఆటగాడిగా నేను చాహల్‌ను ఎదుర్కొనేందుకు ఇష్టపడతా’ అని హెడేన్ అన్నాడు.
స్పిన్నర్లు కేవలం పరుగులు మాత్రమే నియంత్రిస్తున్నారు. వికెట్లు తీయడం లేదు. ఇలా ఎంతోకాలం కొనసాగలేరు. ‘లైయన్’ను చూస్తే తొలి స్పెల్‌లో 90 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరాడు. రెండో స్పెల్‌లో ఆ వేగం 80కి పడిపోయింది. వికెట్లు తీసేందుకు బౌలర్లు ధైర్యం చేయాలి.
ఆసీస్ కుర్రాళ్లు బాగా కష్టపడుతున్నారు. ఆస్టన్ టర్నర్ లాంటి కుర్రాళ్లతో కలిసి నేను పనిచేస్తున్నా. వారి ఆటలో మార్పు తీసుకొస్తున్నా’ అని మాథ్యూ హెడేన్ చెప్పారు.
Read Also: https://www.legandarywood.com