లక్ష్మణ్ మాటల్లో.. ఎన్టీఆర్ మనోవేదన !
ఎన్టీఆర్ కుమారులు తినడమే తప్ప… ఏదో బాలయ్య కొంచెం పర్వాలేదు:
‘ఎన్టీఆర్ బయోపిక్ । లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలు ‘తెరమీద’ ఎన్టీఆర్ ను చూపించటంలో ‘ఫెయిల్’ అయ్యాయనే చెప్పాలి.
ఈ క్రమంలో ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండే వారు మీడియా ముందుకు వచ్చి అప్పట్లో జరిగిన పలు విషయాలనుపంచుకునే ప్రయత్నం చేశారు, ఎన్టీఆర్ వద్ద చాలా కాలం పాటు డ్రైవర్‌గా పని చేయడంతో పాటు ఆయన చైతన్యరథం నడిపిన లక్ష్మణ్ తాజాగా ఓ ఛానల్‌తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

లక్ష్మణ్ మాటల్లో.. ఎన్టీఆర్ మనోవేదన
ఎన్టీ రామారావు తన కుమారుల గురించి చాలా బాధపడుతుండేవారని, తనతో కూడా ఆ విషయాలు చెప్పుకుని బాధపడేవారని తెలిపారు.
ఎన్టీఆర్ కుమారులు తినడమే తప్ప… పని చేసి పైకొద్దామనే ఆలోచన ఎవరికీ ఉండేది కాదు. ఈ విషయంలో పెద్దాయన చాలా కుమిలి పోయేవారు. ‘ఏం లచ్చన్నా… ఎవ్వడూ ప్రయోజకుడు లేడు, నా పేరు నిలిపేవాడు లేడు. ఏదో బాలయ్య కొద్దిగా ఉన్నాడు, కానీ పూర్తి నమ్మకం లేదు.’ అని చెబుతూ ఒకసారి బాధ పడ్డారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్ కుమారులు తినడమే తప్ప…
మొదటి సారి సీఎం అయినపుడు జయశంకర్ బాబుకు కూర్చో పెట్టి చాలా చెప్పాడు. ”నువ్వు బయట తిరిగి… ఏ ఫ్యాక్టరీ పెడితే బావుంటుందనే విషయం కనుక్కో, నేను నీకు ఫ్యాక్టరీ పెట్టిస్తాను, ఐదు, పది వేల మందికి భోజనం పెట్టినవారం అవుతాం. థియేటర్ చూసుకోవడం ఏమిటి?
దాన్ని చూసుకోవడం కూడా మీకు చేతకాదు… దానికి ఇంకా ఓ మేనేజర్‌ను పెట్టుకుంటారు.” అంటూ జయశంకర్ బాబుకు పెద్దాయన చెప్పినట్లు లక్ష్మణ్ వెల్లడించారు.

బాలయ్య కొంచెం పర్వాలేదు
కొడుకులతో ఎన్టీ రామారావు సుఖపడలేదు. ఆయన్ను చివరి వరకు కష్టపెట్టారు. కూతురు పురంధరేశ్వరి రోడ్ నెం.13 దగ్గర్లనే ఉండేవారు. అప్పుడప్పుడూ క్యారేజ్ పట్టుకుని వచ్చేవారు. కొడుకులంతా కేవలం డబ్బు కోసమే వచ్చేవారు. అని లక్ష్మణ్ తెలిపారు.
వారికి డబ్బు అవసరం అయినపుడు వచ్చి పెద్దాయన ముందు రెండు చేతులు కట్టుకుని నిలబడేవారు. డబ్బు అవసరం లేనంత వరకు తండ్రిని చూసేందుకు కూడా వచ్చేవారు కాదు. ప్రతి నెల సార్ డబ్బులు కవర్లలో పెట్టి ఇస్తే… నేను, మోహన్ వెళ్లి స్వయంగా అందరికీ ఇచ్చి వచ్చేవారం.’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
Read Also: https://www.legandarywood.com