వీడియోలు పెట్టే వారి కోసం .. యూట్యూబ్‌కి పోటీ?
వీడియోలు పెట్టే వారి కోసం :
ఒరిజినల్ వీడియో కంటెంట్ తయారుచేసే వారిని ప్రోత్సహించడానికి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఓ సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది,

యూట్యూబ్‌కి పోటీ?
-
ప్రస్తుతం ఐఓఎస్‌లో లభ్యం
-
త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా
-
ఆకట్టుకునే ఫీచర్లతో అందుబాటులోకి
ఫేస్‌బుక్ క్రియేటర్ అని పిలిచే ఈ యాప్ ద్వారా ఒరిజినల్ వీడియోలను, లైవ్ సెషన్లను పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని అందజేస్తున్న గూగుల్ వారి యూట్యూబ్‌కి పోటీగా ఫేస్‌బుక్ ఈ యాప్‌ను తీసుకువచ్చిందని టెక్నికల్ రంగంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్ను త్వరలోనే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. క్రియేటర్స్ యాప్‌లో ఉన్న వివిధ సదుపాయాల గురించి ప్రాజెక్టు మేనేజర్ క్రిస్ హ్యాట్‌ఫీల్డ్ వివరించారు.
`ఈ యాప్ ద్వారా దాదాపు 2 బిలియన్ల మంది వినియోగదారులతో క్రియేటర్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. తమ అభిమానులతో లైవ్ నిర్వహించడం, కామెంట్లు షేర్ చేసుకోవడం వంటివి కూడా చేయవచ్చు. అలాగే వీడియోలను మానిటైజ్ చేసే సదుపాయం కూడా ఉంది.
దీంతో వీడియోల ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది` అని ఆయన తెలిపారు. వీడియోకు, లైవ్‌కి ఇంట్రోలు, అవుట్రోలు, గ్రాఫిక్‌లు, టెంప్లేట్‌లు అమర్చుకునే సదుపాయం కూడా ఉందని ఆయన చెప్పారు.
Read Also : http://www.legandarywood.com/movies-online/telugu-movies-online/