Lokesh Kanagaraj : కమల్ హాసన్ సినిమాల స్పూర్తితోనే లోకేష్ మూవీస్ చేస్తున్నాడా?
Lokesh Kanagaraj : ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా ఓ డైరెక్టర్ పేరు వార్తలలో తెగ నానుతుంది. అతను మరి ఎవరో కాదు విక్రమ్ మూవీని తెరకెక్కించి కమల్‌కి చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందించిన లోకష్ కనగరాజ్. భారీ మల్టీస్టారర్ సినిమాగా విక్రమ్ ను లోకేష్ కనగరాజ్ ఢీల్ చేసిన విధానం ఇప్పుడు ఆడియన్స్ నే కాదు, ఫిలిం మేకర్స్ ను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది.
అభిమాన నటుడు ఆదర్శం..
ఇప్పటి వరకూ ఈ యంగ్ డైరెక్టర్ చేసినవి నాలుగు సినిమాలే అందులో ఖైది, మాస్టర్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. దాంతో లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విక్రమ్ సినిమాలో విక్రమ్ 2, లేదా ఖైదీ 2 ఉండొచ్చు అని లీడ్ ఇచ్చి వదిలేశాడు. విక్రమ్ సక్సెస్ తర్వాత మాగ్జిమమ్ ఆడియన్స్ ఆ జోష్ లో లోకేష్ కనగరాజ్ విక్రమ్ 2 లేదా ఖైదీ2 చేస్తారని అనుకుంటున్నారు.
లోకేష్ మాత్రం ఖైదీ తర్వాత మాస్టర్ ఛాన్స్ ఇచ్చిన తమిళ స్టార్ తళపతి విజయ్ 67వ సినిమాను పట్టాలెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటి వరకు నాలుగంటే నాలుగే సినిమాలు చేసి, గ్రాడ్యుయల్ గా సక్సెస్ రేట్ పెంచుకుంటూ పోతున్నాడు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం విక్రమ్ తో ఆయన కి పాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరొచ్చింది. విజయ్ 67వ సినిమాతో సౌత్ ఇండియా క్రేజీ హీరో విజయ్ ని కూడా పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్తాడని విజయ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
లోకేష్ కనగరాజ్.. విశ్వనటుడు కమల్ హాసన్ కి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఆయనను, ఆయన సినిమాలను స్ఫూర్తిగా తీసుకొని సినిమాలు చేస్తున్నానని ఇదివరకే మీడియా ముఖంగా చెప్పేశాడు. అదీగాక.. కమల్ హాసన్ తో లోకేష్ తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విక్రమ్.. 1986లో కమల్ నటించిన విక్రమ్ సినిమాతో.. 2019లో కార్తీతో తెరకెక్కించిన ఖైదీ సినిమాలతో లింక్ చేసి చూపించి మెప్పించాడు.
లోకేష్ తీసే ప్రతి సినిమాకు గతంలో కమల్ చేసిన పాత్రలు, సినిమాలను రిఫరెన్స్ లుగా తీసుకోవడం మనం గమనించవచ్చు. అలాగే తన ప్రతి సినిమా ఎండింగ్ టైటిల్స్ లో లోకేష్ స్పష్టంగా కమల్ హాసన్ నటించిన ఫలానా సినిమా నుండి ఇన్స్పైర్ అయి ఈ సినిమా తీశానని మెన్షన్ చేస్తుంటాడు. లోకేష్ డెబ్యూ మూవీ నగరం. ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ లుక్ చూసినట్లయితే.. కమల్ హాసన్ నటించిన ‘సత్య’ సినిమా లుక్ కనిపిస్తుంది.
అదేవిధంగా.. ఖైదీలో కార్తీ లుక్.. పోతురాజులో కమల్ లుక్ పోలిఉంటుంది.. అలాగే మాస్టర్ లో దళపతి విజయ్ లుక్ చూస్తే.. 1995లో కమల్ చేసిన ‘నమ్మవర్’ లుక్ పోలి ఉండటం విశేషం. అలాగే ఈ సినిమాలకు ఎండింగ్ లో కమల్ సినిమాలను మెన్షన్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఇలా చూస్తే లోకేష్.. కమల్ సినిమాలను చూసి ఏ స్థాయిలో ఇన్స్పైర్ అయ్యాడో.. ఆ క్యారెక్టర్స్ లుక్.. తాను తెరకెక్కిస్తున్న సినిమాలలో హీరోల లుక్స్ చూస్తే ఆ ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లోకేష్ తెరకెక్కించిన నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్.. సినిమాలను గతంలో కమల్ పోషించిన పాత్రలతో కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.