‘లోకేష్’ తీరు టీడీపీ ‘నవ్వులపాలు’ !
‘లోకేష్’ తీరు టీడీపీ ‘నవ్వులపాలు’:
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెరాసకి ఎదురుగాలి వీచినా తెరాస అధికారం రావటంలో కేటీర్ కృషి ఎనలేనిది, మరి దీనికి వ్యతిరేకంగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి.
నారా లోకేష్ ప్రసంగం తెలుగు హాస్య సినిమాలను తలపిస్తుంది, తన లోకజ్ఞానం లేని ప్రసంగాల వల్ల నవ్వులపాలవుతున్నారు ఒక రాష్ట్ర మంత్రిగా, ఏకంగా మూడు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న ఆయనకు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా తెలియదు.

‘లోకేష్’ తీరు టీడీపీ ‘నవ్వులపాలు’
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అప్పుడు మాట్లాడుతూ, దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయంటూ తప్పులో కాలేశారు. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా తెలియని నాయకుడు మంత్రి అయ్యాడంటూ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.
అలాగే, శనివారం చేసిన ప్రచారంలో మార్చి 23న ఓట్ల లెక్కింపు ఉందంటూ మరోసారి నోరుజారారు. నారా లోకేష్ చేసే పసలేని ప్రసంగాల వల్ల ప్రత్యర్థి పార్టీవాళ్ళు కష్టపడకుండానే గెలిచే పరిస్థితివచ్చింది.
Read Also: https://www.legandarywood.com