Mahesh Babu: ఆ హీరోయిన్స్‌ వద్దు.. పనిచేయడం కష్టం… రాజమౌళికి మహేష్ కండీషన్..

Mahesh Babu: మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఇక ఎప్పటిలాగే రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ సినిమా గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా విషయంలో మహేష్ బాబు, రాజమౌళికి కొత్త కండీషన్ పెట్టారట.

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలైలో షూటింగ్‌ను మొదలుపెట్టనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగతోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఇక ఎప్పటిలాగే రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ సినిమా గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా విషయంలో మహేష్ బాబు, రాజమౌళికి కొత్త కండీషన్ పెట్టారట.

ఆ కండీషన్ ఏమంటే.. ఈ సినిమాలో హిందీ హీరోయిన్స్‌ను కాకుండా టాలీవుడ్‌కు చెందిన నటినే హీరోయిన్‌గా పెట్టాలనీ కోరారట. దీనికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. మహేష్ బాబు హిందీ హీరోయిన్లతో విసిగిపోవడమే వల్లే ఈ డిమాండ్ పెట్టారట. చెప్పాలంటే మహేష్ సినిమాల్లో ఎక్కువగా హిందీ హీరోయిన్సే నటించారు.

ఆయన మొదటి సినిమా హీరోయిన్ ప్రీతి జింటా హిందీ నుంచే వచ్చారు. ఇక ఆ తర్వాత బిపాషా బసు, లీసా రే, నమ్రత, కృతి సనన్, సోనాలి బింద్రే, అమృత రావు, కియారా అద్వానీ, పూజా హెగ్డే ఇలా చాలా మంది హిందీ హీరోయిన్లతో పని చేశారు. హిందీ హీరోయిన్స్‌కు డిమాండ్స్ ఎక్కువ.. దీనికితోడు రకరకాల సదుపాయాలు కావాలంటూ విసిగిస్తారట. ఈ కారణంగానే మహేష్ రాజమౌళికి అలా సూచించారట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న మహేష్ యూరప్‌ నుంచి అమెరికా వెళ్లనున్నారట. అక్కడ ఆయన మరో వారం ఉంటారట. అయితే మహేష్ అమెరికాలో ఓ ప్రాపర్టీని కొనడానికి వెళ్తున్నారని టాక్ నడుస్తోంది. అక్కడ మహేష్ ఓ యాబై కోట్లతో కొంత ఇన్వెస్ట్ చేయనున్నారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఆయన తన తదుపరి సినిమాను త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ జూలై చివరిలో ప్రారంభించాలని ప్లాన్ చేశారట టీమ్.

దీంతో ఇప్పటికే టీమ్ మ్యూజిక్ సిట్టింగ్స్‌‌లో ఉందని.. మరోవైపు స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యిందని అంటున్నారు. దీంతో అంత అనుకున్నట్లు జరిగితే జూలై చివరి వారంలో షూటింగ్‌కు వెళ్లనుంది టీమ్. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్‌గా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక మహేష్ – త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్ గతంలో అతడు,  ఖలేజా  సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక పదకొండు సంవత్సరాల తరువాత (Mahesh Babu) మహేష్- త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్నారు.

ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది టీమ్. ఇక మరోవైపు  (Trivikram Srinivas) త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయన ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను రూపోందించారు. ఈ సినిమా కూడా హారికా హాసిని బ్యానర్‌పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది 28వ చిత్రం.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇందులో సూపర్ స్టార్‌ మహేష్ బాబుకు అంకుల్ పాత్రలో  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.

ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది. అంతేకాదు ఈ మూవీలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు టాక్.

గతంలో త్రివిక్రమ్.. నదియా, కుష్పూ వంటి సీనియర్స్ హీరోయిన్స్‌ను మరోసారి టాలీవుడ్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కోవలో శోభనను కూడా ఈ సినిమాలో పాత్ర కోసం ఒప్పించినట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్యాన్ ఇండియా సినిమాను చేయనున్నారు.

ఇక మహేష్ లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట విషయానికి వస్తే.. ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాకు యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయింది. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ’మురారి వా’ అనే ఫుల్ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది. ఈ సినిమా జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

About the Author

Leave a Reply

*