Megastar Chiranjeevi : ఆ పుకార్లకు చెక్ పెట్టే ప్లాన్.. ముందు జాగ్రత్త పడుతున్నారా?

Megastar Chiranjeevi : గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా పక్కా కమర్షియల్ అనే సినిమా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో రూపొందింది.  బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

Megastar Chiranjeevi to Pakka Commercial Pre Release Event : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రకటించిన నాలుగు సినిమాల్లో దాదాపు మూడు సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. అయితే మెగాస్టార్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా మెగాస్టార్ ఏదైనా సినిమా ఈవెంట్ కు హాజరవుతున్నారు అంటే అది తనకు చాలా దగ్గర వారైతే మాత్రమే హాజరవుతారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఆయన పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారనే వార్త చర్చనీయాంశమవుతోంది.

అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో గోపీచంద్ హీరోగా రాశీఖన్నా హీరోయిన్ గా పక్కా కమర్షియల్ అనే సినిమా రూపొందింది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్,  యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారని తెలుస్తోంది. మారుతి తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుందని గీతా కాంపౌండ్ భావిస్తోంది. అందుకే ఈ సినిమా మీద మరి కొంత కృషి చేస్తే మార్కెట్ పెరిగే అవకాశం ఉందని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. 26న హైదరాబాద్‌లో గ్రాంగ్ లెవల్లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు సమాచారం.

అయితే మెగాస్టార్ ఈ ఈవెంట్ ఒప్పుకున్నా విషయం మీదే ఇప్పుడు సరికొత్త చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా అల్లు కాంపౌండ్ కి మెగా కాంపౌండ్ కి మధ్య అంతగా సంబంధాలు బాగా లేదని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ తనను తాను ఐకాన్ స్టార్ గా జనాల్లో ముద్రించుకునే తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మెగా హీరో అనే ముద్ర చెరుపుకుని ముందుకు వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే మెగా ఫ్యామిలీకి,  అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం కూడా పెరిగింది అని ప్రచారం మొదలైంది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఇలా చీలిపోవడం కరెక్ట్ కాదని ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారట.

 

ముందు నుంచి కూడా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఒక స్థాయికి వచ్చి ఇప్పుడు ఇలా దారులు వేరు చేసుకుని ఉండడం కరెక్ట్ కాదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది మాత్రం ఆచార్య సినిమా ఎఫెక్ట్ తర్వాత మెగా ఫ్యాన్స్ లో చీలిక వ్యవహారం మీద మెగాస్టార్ దృష్టి పెట్టారని గతంలో అందరూ కలిసి ఉన్న సమయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా కలెక్షన్లు బాగానే వచ్చేవి,  కానీ ఇప్పుడు ఆచార్య విషయంలో ఇబ్బంది పడడంతో తమలో తాము ఇలా దూరం కావడం కరెక్ట్ కాదని భావించారని తెలుస్తోంది. అందుకే అల్లు కాంపౌండ్ నుంచి పిలుపు రాగానే మెగాస్టార్ ఓకే చెప్పారని తెలుస్తోంది.

ఇక మీదట తమ మధ్య ఎన్ని ఉన్నా బయటకు రానీయకుండా కలిసి ఉండాలని మెగాస్టార్ ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన నాలుగు సినిమాలు, రామ్ చరణ్ సినిమాలు కూడా విడుదలకు రెడీ అవుతున్న క్రమంలో ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ పెంచకుండా ముందు జాగ్రత్త పడుతున్నారంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అందుకే కొద్ది రోజుల క్రితం ఆయన ఆహా షో ఫినాలేకి కూడా వెళ్ళారని అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

About the Author

Leave a Reply

*