భారత్ లో కరోనా విలయం !
వాక్సిన్ అందుబాటులో ఉన్నా…. భారత్ లో కరోనా విలయం:
రోజు రోజుకూ భారత్ లో కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి… తాజా లెక్కల ప్రకారం గడచిన 24 గంటలలో… దేశవ్యాప్తంగా 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి… ఇదే సమయంలో 19,957 రికవరీ కేసులు… 140 మరణ కేసులు నమోదయ్యాయి..దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,33,728 కాగా ..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,02,022 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,09,73,260 కి చేరింది.
“కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,58,446 నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 20,53,537 కు చేరింది.
దేశంలోని ఆరు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, కేరళ, ఢిల్లీలో పరిస్థితి అదుపు దాటింది. ఈ రాష్ట్రాల్లోనే 80 శాతం కేసులు నమోదవుతున్నాయి.
చూస్తుంటే… దేశంలో కరోనా సెకండ్ వేవ్ తో ఏప్రిల్ నుంచి లాక్-డౌన్ చేస్తారని పుకారు షికారు చేస్తుంది.