Previous Story
ములుగు జ్యోస్యం… జగన్ ప్రభంజనం !
Posted On 07 Apr 2019
Comment: 0
ములుగు జ్యోస్యం… జగన్ ప్రభంజనం:
ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉన్న వేళ, జగన్ కు జోష్ వచ్చేలా చేశారు ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ సిద్ధాంతి గారు.
జగన్ జాతకాన్ని విశ్లేషిస్తూ, ఆయన జాతకంలో ఈ నెల 30 వరకూ శని మహర్ధశ ఉంటుందని, ఆపై బుధ మహర్దశ ప్రారంభమవుతుందని తెలిపారు.

ములుగు జ్యోస్యం… జగన్ ప్రభంజనం
ఆయన ఆరుద్రా నక్షత్రం, కన్యాలగ్నంలో, మిథున రాశిలో జన్మించారని, శక్తిమంతమైన బ్రహ్మయోగం, గజకేసరి యోగం ఆయన జాతకంలో ఉన్నాయని అన్నారు. లగ్నదశమాధిపతి అయిన బుధుడు అతిక్రాంత యోగాన్ని అందివ్వనున్నారని, దీనివల్ల విశేష రాజయోగం రానుందని చెప్పారు.
రాజ్యాధికారం సంపాదించాలంటే కావాల్సిన శని అనుగ్రహం విషయంలో జగన్ ముందున్నారని, ఆయన జాతకంలో శని పితృస్థానంలో ఉన్నారని అన్నారు.
Read Also: https://www.legandarywood.com