అంచనాలు పెంచుతున్న ‘నాగకన్య’ టీజర్ !
అంచనాలు పెంచుతున్న ‘నాగకన్య’ టీజర్ :
వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్, జర్నీ ఫేమ్ ‘జై ‘ ప్రధాన తారాగణంగా ఎల్. సురేష్ దర్శకత్వంలో వస్తున్న తాజాచిత్రానికి తెలుగులో ‘నాగకన్య’ గా టైటిల్ కన్ఫర్మ్ చేశారు. కాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్, రెండో లుక్ గా లక్ష్మి రాయ్ పోస్టర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

‘నాగకన్య’ టీజర్
‘కేథరీన్’ క్యారెక్టర్ తో కూడిన పోస్టర్ ని 10వ తేదీన విడుదల చేస్తారు ఈనెల 11న ‘నాగకన్య’ టీజర్ ని రిలీజ్ చేస్తారు. చాలాకాలం తరువాత పాము నేపథ్యంలో తమిళంలో ‘నీయా’ చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో ‘జై’ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నాగకన్య’ పేరుతో విడుదల చేయనున్నారు.

‘జై’ ఒక కీలకమైన పాత్రలో
త్వరలోనే ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నారు. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ పాత్రలు వూహించని విధంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు మంచి పేరొచ్చేలా ఉంటుంది అని సినిమా నిర్మాతలు అంటున్నారు.
Read Also: https://www.legandarywood.com