బాలయ్య గర్జిస్తే… బాక్స్ ఆఫీస్ పూనకాలే !

బాలయ్య దెబ్బ… బాక్స్ ఆఫీస్ అబ్బ అనాల్సిందే:
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటేనే అంచనాలు అందనంత దూరంలో ఉంటాయి.. ఈ కొంబో అంటేనే అభిమానుల్లో విపరీతమైన క్రేజీ ఎందుకంటే.. సినిమా సినిమాకు ‘సింహా | లెజెండ్’ విభిన్నమైన కథ కథనం అంతకు మించి బాక్స్ఆఫీస్ షేక్ చేసే స్టామినా ఉన్న నందమూరి అందగాడు చేయటం.

ఉగాది పర్వదినం సందర్భంగా….వీరిద్దరి కొంబోలో రాబోయే మూడో సినిమాకు అఖండ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ రోజు టైటిల్ తో పాటుగా టీజర్ను కూడా సినిమా యూనిట్ విడుదల చేసింది.

‘అఖండ’ లో బాలయ్య పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు వార్తలు వచ్చినట్లే ఇది అఘోరా తరహా పాత్ర అని అర్థం అవుతోంది. టీజర్ లో ‘హరహర మహాదేవ శంభో శంకర’ అంటూ చేతిలో త్రిశూలం పట్టుకుని విలన్ల భరతం పడుతున్నాడు. “కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది” అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అలరిస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. ఈ సినిమాలో సయేషా సైగల్ | ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ | పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ నేపథ్య సంగీతం అదుర్స్… ‘అఘోరా’గా బాలయ్య బాబు అనగానే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఊహించేసుకున్నారు. వారి ఊహలకు అందని స్థాయిలో బాలయ్య లుక్ ను డిజైన్ చేసారు. జై బాలయ్య.

About the Author

Related Posts

Leave a Reply

*