కేంద్రంలో ‘కాషాయం’ ఏపీలో ‘గాలి’ ప్రభంజనం !
కేంద్రంలో ‘కాషాయం’ ఏపీలో ‘గాలి’ ప్రభంజనం:
తాజా అసెంబ్లీ, లోక్ సభ ఫలితాలు కొందరికి శరాఘాతం ఐతే | మరికొందరికి నూతనోత్తేజాన్ని ఇచ్చాయి, ఢిల్లీ పీఠాన్ని మళ్ళీ బీజేపీ కైవసం చేసుకుని నూతన రికార్డ్స్ తిరగరాశారు. ఎల్ కే అద్వానీ । వాజపేయి కి సాధ్యం కానిది, నరేంద్ర మోడీ ఒంటి చేత్తో కాషాయాన్ని రెప… రెప… లాడించారు.
చంద్రబాబు నాయుడుకి ఈ ఎన్నికలు ఇంటా | బయట అపఖ్యాతిని మిగిల్చాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పాలనను గాలికొదిలేసి, మూడో ఫ్రంట్ । ఢిల్లీ । మిత్ర పక్షాలకోసం ప్రచారమని…. ఈ ఐదేళ్లు పాలననను నీరుగార్చారు.

కేంద్రంలో ‘కాషాయం’ ఏపీలో ‘గాలి’ ప్రభంజనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నారా చంద్రబాబు నాయుడు మే 23వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేయనున్నారు.
మరోవైపు, నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈనెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 30వ తేదీ గురువారంతో పాటు…. ఏకాదశ తిధి కావడంతో ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు సమాచారం.
తాజా ఎన్నికల్లో, లోక్ సభలో సైతం క్లీన్ స్వీప్ గా పయనిస్తూ ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుంది, కౌంటింగ్ సరళిని చూసుకుంటే 150కిపైగా సీట్లతో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఘోర ఓటమి ఖాయం కావడంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామా చేయబోతున్నారు.
రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబు గవర్నర్‌కు పంపించనున్నారు, శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలిసే అవకాశముంది.
మొత్తంగా, కేంద్రంలో కాషాయం । ఏపీ లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తున్నాయి.
Read Also: https://www.legandarywood.com