Nato countries looks for the 3rd world war !
ఒకరిది ఆరాటం…మరొకరిది ప్రాణ సంకటం:
రష్యా | ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి 25 రోజులు.. ఇంకా యుక్రెయిన్‌పై..రష్యాకు పట్టు చిక్కలేదు.. ఫలితంగా దాడులను…తీవ్రతరం చేసింది. ఒకరిది పట్టుకోసం… మరొకరిది ప్రాణం | అత్యాశ కారణంగా… కూడని నాటో బంధం కోసం ఎదురుచూపులు…మధ్యలో సంబంధంలేని అమెరికా | బ్రిటన్.. వారు ఉనికి కోసం ఆరాటం… ఫలితం గతంలో వీరీ స్వార్ధానికి బలైన… ‘ఇరాన్ | బాంగ్లాదేశ్ | పాకిస్తాన్’ తదుపరి ఉక్రెయిన్… దీనిని గుర్తించటంలో ఉక్రెయిన్ అధ్యక్షడుగా ఉన్న జెలెన్‌స్కీ దారుణంగా విఫలమై తనను తాను హీరోగా ప్రపంచానికి చూపించుకోవటం శోచనీయం… ఇతని స్వార్ధ ఫలితమే నేటి ఈ దయనీయ పరిస్థితి.
యుక్రెయిన్‌పై దండెత్తిన రష్యా.. రోజురోజుకు దాడులను తీవ్రతరం చేస్తోంది. ఆ దేశంపై పట్టు కోసం.. హైపర్ సోనిక్ మిస్సైల్స్‌ని కూడా ప్రయోగిస్తోంది. ఖార్కివ్‌లో అపార్ట్‌మెంట్లపై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడింది. శిథిలాల కింద చాలా మంది సామాన్యులు చిక్కుకుపోయారు. వాళ్లందిరిని రక్షించేందుకు రంగంలోకి దిగారు అధికారులు.
అటు.. నికోలివ్ మిలటరీ ఎయిర్‌బేస్‌పై రష్యా రాకెట్ దాడి చేయగా.. 40 మంది చనిపోయారు. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఇక ఈ దాడిలో ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. అందులో.. చిన్నారులు, వృద్ధులు ఉండడం తీవ్రంగా కలిచివేస్తోంది.
అటు లీవ్ | ఖార్కీవ్ | మరియపోల్‌లోనూ… రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. ఆస్పత్రులు | స్కూళ్లు | ప్రార్ధనామందిరాలు ఇలా.. అన్నింటిపైనా రష్యా దాడులను తీవ్రతరం చేసింది. యుక్రెయిన్ ప్రజలే లక్ష్యంగా… రష్యా దాడులకు తెగబడుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలు | రెసిడెన్షియల్ బిల్డింగ్‌లపైనా.. రష్యా బాంబుల మోత మోగిస్తోంది. మరోవైపు.. రష్యాను అడ్డుకునేందుకు యుక్రెయిన్ సైనికులు, ప్రజలు వీరుల్లా ముందుకు కదులుతున్నారు. యుక్రెయిన్‌ను రష్యా కైవసం చేసుకోకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయుధాలు చేపట్టి.. రష్యా సైనికులకు చుక్కలు చూపిస్తున్నారు.
అలాగే రష్యా తన పంథాను పూర్తిగా మార్చుకుని…రాజధాని లక్ష్యంగా.. నాలుగు వైపులా… అష్ట దిగ్బంధనం చేసి… బయటి దేశాలతో ఉన్న సంబంధాన్ని కట్ చేసి… బయట వనరులు అందకుండా ఉక్రెయిన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది… ఆహార వనరులు | నీరు | గ్యాస్ వనరులు | ఇత్యాది అవసరమైన వనరులు దాదాపు ఖాళీ అయ్యాయి… వీటిని అధిగమించటంలో.. దారుణంగా విఫలమై… ప్రగల్భాలకు పోతుంది… మరొక వైపు.. సముద్ర తీర ప్రాంతాలనుంచి…రష్యా అత్యాధునిక మిస్సైల్స్ తో… ఉక్రెయిన్ ను.. దారుణంగా దెబ్బ కొడుతోంది… దాదాపు స్మశానంగా మారుతున్నాయి.. ఉక్రెయిన్ నగరాలూ…మరొక రెండు నుంచి మూడు వరాల వ్యవధిలో…రష్యా… ఉక్రెయిన్ ను హస్తగతం చేసుకొని.. తన అనుకూల ప్రభుత్వాన్ని… ఏర్పాటు చేస్తుందని స్పష్టమైన అంచనా…
తత్ఫలితంగా అమెరికా | బ్రిటన్ వాటి ప్రభావాన్ని కోల్పోవటం… మరల ‘చైనా | భారత్’ ఈ ప్రపంచాన్ని ఏలతాయనటంలో…. ఎలాంటి సందేహం లేదు.