‘కేరళ’లో ఐసిస్ కదలికలు… ఎన్‌ఐఏ ‘దాడులు’ !

‘కేరళ’లో ఐసిస్ కదలికలు… ఎన్‌ఐఏ ‘దాడులు’:

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పెను భూతం ఐసిస్‌,  మత । ప్రాంత భేదం లేకుండా తమ ఉనికిని చాటుకునేందుకు సామాన్య ప్రజలను టార్గెట్ గా చేసుకుంటుంది.

గడిచిన వారం శ్రీలంకలో పెను బీభత్యం మరువక ముందే ఇండియాలో కూడా ఐసిస్‌ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో కేరళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది తాజాగా, కేరళలో మూడు చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం సోదాలు చేపట్టింది.

ఐసిస్‌ తో సంబంధాలున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంది వీరు ఐసిస్‌లో చేరేందుకు ఆసక్తి కనబర్చారని,

 

'కేరళ'లో ఐసిస్ కదలికలు... ఎన్‌ఐఏ 'దాడులు'

‘కేరళ’లో ఐసిస్ కదలికలు… ఎన్‌ఐఏ ‘దాడులు’

ఉగ్ర సంస్థతో సంబంధాలున్నాయనే సమాచారం ఉందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు  వీరి నుంచి చరవాణులు । సిమ్‌ కార్డులు । పెన్‌డ్రైవ్‌లు। సీడీలను స్వాధీనం చేసుకున్నారు.

‘స్వాధీనం చేసుకున్న వాటిలో అరబిక్‌ । మలయాళం భాషల్లో రాసిన కాగితాలు గుర్తించాం ముస్లిం మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ సీడీలు ఉన్నాయి పెన్‌డ్రైవ్‌లను ఫోరెన్సికల్‌గా పరీక్షించి విశ్లేషించాల్సి ఉంది’  అని ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో పేర్కొంది.

కేరళలో 21 మంది ఒక్కసారిగా కనిపించకుండా పోయిన ఘటనలో వీరు ఐసిస్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది,  వీరిలో 17 మంది కాసర్‌గోడ్‌ నుంచి కాగా నలుగురు పాలక్కడ్‌ వాసులు.  ఈ 21 మందిలో నలుగురు మహిళలు । ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*