ఎన్టీఆర్ పై మరో బయోపిక్ !!!
- ‘ఎన్టీఆర్’పై నాల్గో బయోపిక్
- తెరకెక్కించనున్న నిర్మాత రామసత్యనారాయణ?
- ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం
‘ఎన్టీఆర్’ బయోపిక్ ను తెరకెక్కిస్తానని నందమూరి బాలకృష్ణ ప్రకటించిన తర్వాత, ప్రముఖ దర్శకుడు వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, కేతినేని జగదీశ్వరరెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్రాలను తెరకెక్కిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, వీళ్లందరి కన్నా ముందే ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానని నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గతంలో ఓ ప్రకటన చేశారు. కానీ, ఆ సినిమా నిర్మాణంపై ఎటువంటి కసరత్తు జరగలేదు. తాజాగా, ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఒక ఏడాదిలో ఎక్కువ చిత్రాలు నిర్మించిన నిర్మాతగా రామ సత్యనారాయణ పేరు పొందారు. రామసత్యనారాయణ తెరకెక్కించనున్న ఎన్టీఆర్ బయోపిక్ వివరాల కోసం అటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also : http://www.legandarywood.com/latest-news-updates/