Nutrition For Women : మహిళలు రోజూ వీటిని తినాల్సిందేనట..

జీవితంలో ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చురుగ్గా, హ్యాపీగా ఉంటారు. నేటి ఫాస్ట్ లైఫ్‌లో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యం. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించడం ముఖ్యం. మన ఆరోగ్యానికి మంచి ఆహారం అనేది చాలా ముఖ్యం. మహిళలకి కూడా నేడు పోషకాహారం చాలా ముఖ్యం. వారు రోజులో ఏం తింటున్నారో వాటిపై శ్రద్ధ అవసరం. నిపుణుల ప్రకారం మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ గురించి చూద్దాం.

పోషకాహారం అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం. పోషకాహార లోపం కారణంగా పెరుగుదల సరిగ్గా లేకపోవడం, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే మహిళలు ముందు నుంచే పోషకాహారం తసీుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం వల్ల వారికే కాకుండా పుట్టే పిల్లలకి కూడా మంచిది. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంగా ఉండాలంటే ముందునుంచే పోషకాహారం చాలా ముఖ్యం. తల్లిపాల కారణంగా పిల్లలకి సరైన పోషణ అందుతుంది. ఎదుగుతున్న పిల్లలకి కాల్షియం, ఐరన్, అయోడిన్ వంటివి చాలా అవసరం. ఇవి కేవలం పిల్లలకి మాత్రమే కాదు గర్భధారణ సమయం నుంచి వృద్ధాప్యం వరకూ మహిళల్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తాయి. ఇక పోతే మహిళలు వ్యాయామం చేయడం కూడా ముఖ్యం. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర అనేవి మహిళల ఆరోగ్యం విషయంలో కీ రోల్ పోషిస్తాయి.

హెల్దీ లైఫ్‌స్టైల్ పాటించాలంటే మహిళలు కొన్నింటికీ దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటేంటే.. ఉప్పు, పంచదారలను తగ్గించాలి. అదే విధంగా ప్యాకేజ్డ్ ఫుడ్, డ్రింక్స్, జంక్‌ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. దీనిని నుంచి కేలరీలను తగ్గించుకోవచ్చు. కేలరీలు ఎక్కువగా ఉంటే యుక్తవయస్సు నుంచే ఊబకాయం, మొటిమలు, పీసీఓడి, హార్మోన్ల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వీటి నుంచి ఎంత దూరం ఉంటే అంతమంచిది.

వీటిని తీసుకోవడం చాలా మంచిది..

అదే విధంగా ఏమేం తినాలో ఇప్పుడు చూస్తే ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు ఇంట్లో వండిన ఆహారమే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు.

బ్యాలెన్సింగ్ అవసరం..

పోషకాహార కొరతను దూరం చేయడం కాస్తా కష్టమే. ఎందుకంటే మీ శరీరానికి తగిన పరిమాణంలో ఆహారం మాత్రమే కాకుండా ఏమేం అవసరమో తెలుసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, నీరు, విటమిన్స్, మినరల్స్ ఇలాంటి పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలుసుకుని అవే తీసుకోవాలి.

సరైన పోషకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్త్రీలు తమ వయసుకి తగినంతగా పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా, వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే సమస్యల గురించి కూడా వారికి కనీస అవగాహన ఉండాలి. ఎప్పటికప్పుడు వైద్యుల చేత టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం.

కుటుంబంలో స్త్రీ పాత్ర కీలకం. ఆమె బావుంటే ఆమె చుట్టూ ఉన్న వాతావరణం కూడా బాగుంటుంది. అలా ఉండాలంటే ముందు నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

About the Author

Leave a Reply

*