Online Exams: ఆన్‌లైన్ పరీక్షలపై సందేహాలా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Online Exams | ప్రస్తుతం దాదాపు అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. ఎంసెట్, జేఈఈ మెయిన్, నీట్ , క్యాట్, జీమ్యాట్ మొదలైన ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ పరీక్షలకు సంబంధించి పలు సందేహాలు వస్తుంటాయి.. వాటి గురించి తెలుసుకోండి
1. విద్యా ప్రవేశ పరీక్షలే కాకుండా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జరిగే పోటీ పరీక్షలను కూడా కంప్యూటర్ ఆధారితంగా (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త సందేహాల ఉండడం సహజం.
2. ఆన్‌లైన్ పరీక్షల్లో మోసాలు ఏమైనా జరుగుతాయా అని చాలా మంది సందేహిస్తుంటారు.
ఆన్‌లైన్ విధానంలో జరిగే పోటీ పరీక్షల్లో మోసాలకు ఆస్కారమే లేదని నియామక సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
3. ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయి నియామక సంస్థలతోపాటు.. ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించే ఏజెన్సీలన్నీ ఆన్‌లైన్ బాటపడుతున్నాయి. దాదాపుగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపుతున్నాయి. ఈ ఆన్‌లైన్ పరీక్షల కోసం నిపుణుల బృందం పెద్ద సంఖ్యలో ప్రశ్నలను సిద్ధం చేస్తుంది.
4. ఈ ప్రశ్నల నిధి నుంచి పరీక్ష బ్లూ ప్రింట్‌కు అనుగుణంగా అవసరమైన ప్రశ్నలను సాఫ్ట్‌వేర్ అల్గారిథం ఎంపిక చేస్తుందని చెబుతున్నారు. అంతేగాకుండా ఆయా ప్రశ్నల నిధిని వ్యక్తిగతంగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఎవరికీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్నలను కాని, ప్రశ్న పత్రాల్ని కాని ఎలాంటి పరిస్థితుల్లోనూ పేపర్‌పై రాయడం కాని, ప్రింట్ చేసే అవకాశం ఉండదని ప్రముఖ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించే సంస్థ నిపుణుడు ఒకరు తెలిపారు. ఇలా చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఆన్‌లైన్ ప్రశ్నపత్రం ముందే వె లీక్ కాదని నిపుల ఆయన స్పష్టం చేశారు.
5. నిపుణులు చెప్పిన దాని ప్రకారం కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ప్రతి ప్రశ్న రహస్యంగానే ఉంటుంది. అల్గారిథం ఆధారంగా సిద్ధమయ్యే ప్రశ్నపత్రం టెస్టు సెంటర్లకు వెళ్లడానికి ముందే ఎన్‌క్రిప్ట్ చేసే విధంగా టెక్నాలజీ ఉంది. ఈ క్వశ్చన్ పేపర్ అభ్యర్థి పరీక్ష ప్రారంభించి.. మౌస్‌తో క్లిక్ చేసే వరకు రహస్యంగానే ఉంటుంది. మౌస్‌తో క్లిక్ చేసిన తర్వాతే డిక్రిప్ట్ అవుతుంది.
6. ఆన్‌లైన్ పరీక్ష ప్రశ్నపత్రం గురించి ఏ ఒక్కరికి తెలిసే అవకాశమే లేదు. కానీ, కొందరు తమ వద్ద రేపు రాయబోయే ప్రశ్నపత్రం ఉందంటూ.. అమాయకులను మోసగించి అందినకాడికి దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల విద్యార్థులు, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ తేదీలు, తెలంగాణ ఈసెట్” width=”1600″ height=”1600″ /> 7. ఆన్‌లైన్ పరీక్షల విధానంలో.. పక్కన పరీక్ష రాస్తున్న వారి దాంట్లో చూసి కాపీ కొట్టే అవకాశమే ఉండదని చెబుతున్నారు. ఎందుకంటే.. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షలో ప్రశ్నల సంఖ్య క్రమం, మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలకు ఆప్షన్ల క్రమం పూర్తిగా వేర్వేరు ఉండేలా స్మార్ట్ అల్గారిథమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. వీటివల్ల పక్కవారి ప్రశ్నపత్రం నుంచి చూసి కాపీ కొట్టడానికి అవకాశం ఉండదు. అలానే కంప్యూటర్ తెరపై ఒకసారి ఒకటే ప్రశ్న కనిపిస్తుంది.