వ్యవసాయ బిల్లుపై రగులుతున్న భారతం !
‘వ్యవసాయ’ బిల్లుపై రగులుతున్న ‘భారతం’:
తాజాగా పాసైన వ్యవసాయ బిల్లులు రైతులు | లారీ డ్రైవర్స్ సహోదరుల పాలిట శరాఘాతంగా మారింది. ఈ బిల్లులను బీజేపీ మిత్ర పక్షాలు | ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. బీజేపీ తనదయిన శైలిలో….
రైతు ఉత్పత్తుల వాణిజ్య | వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్, ఫెసిలిటేషన్) | రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ | సేవల ఒప్పంద బిల్లు-2020 (ది ఫార్మర్స్ (ఎంపర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లుతోపాటు నిత్యావసర సరకుల సవరణ బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండమెంట్) బిల్లులను లోక్‌సభలో ఆమోదించింది.
అయితే మోడీ కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ…. చిన్న | సన్నకారు రైతు సహోదరుల పాలిట శరాఘాతమైన ఈ బిల్లుల వల్ల…. కనీస మద్దతు ధరను కూడా రైతులు కోల్పోయే విధంగా చేయటం…. చాలా దురదృష్టకరమని ‘బీకేఎస్ జనరల్ సెక్రటరీ బద్రి నారాయణ్ చౌదరి’ పేర్కొన్నారు.. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి ఇప్పటికే 50 వేల మంది రైతులు లేఖలు రాశారని గుర్తు చేశారు.
రైతుల నిరసనలతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అమృత్‌సర్‌లో లారీ డ్రైవర్లు రైతుల తీరుపై మండిపడ్డారు. మరోవైపు రహదారిని వారు లారీలతో దిగ్బంధించారు. కేవలం లారీలను మాత్రమే ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. సుమారు పది వేల వరకు లారీలు నిలిచిపోయాయని, అందులో త్వరగా పాడయ్యే వస్తువులు కూడా ఉన్నాయని చెప్పారు. తమ లారీలను కదలనివ్వకపోతే ఏ వాహనం నడవకుండా అన్ని రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
పంజాబ్ | హరియాణాలలో ఈ ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి… మరి ఈ ఆందోళనలు ఎన్ని అల్లర్లకు కారణం అవుతాయో… అని ఇన్నర్ టాక్.