పవార్ మాటల్లో… ఏపీ సీఎం ప్రధాని అభ్యర్థి !

పవార్ మాటల్లో… చంద్రబాబు ప్రధాని అభ్యర్థి:

ఎన్సిపి అధినేత శరద్ పవార్ పీఎం ఆభ్యర్దిత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు పీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు బెటర్ అని తన మనసులో మాటను బయట పెట్టారు పవార్.

ఇంకా, ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవాల్సి వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి । తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ । బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి । ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హత గలవారని ఆయన చెప్పారు.

ఎన్డీయేతర పక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ని తోసిపుచ్చారు, ‘మాయావతి । మమతా బెనర్జీ లేదంటే చంద్రబాబు  ఎన్డీయేతర పక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే…

 

పవార్ మాటల్లో... చంద్రబాబు ప్రధాని అభ్యర్థి

పవార్ మాటల్లో… చంద్రబాబు ప్రధాని అభ్యర్థి

 

వీరు ముగ్గురూ అర్హులే  కాంగ్రెస్ అధినేత రాహుల్ కంటే వీరిని ఎంచుకోవడమే ఉత్తమం’ అని పవార్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాతే ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని తేల్చి చెప్పారు.

  • ఇంకా, 2004 ఎన్నికల తర్వాత కూడా ఇదే జరిగిందని పవార్ గుర్తు చేశారు.
  • అలా పదేళ్ల పాటు సుస్థిర పాలనా అందిచామని చెప్పుకొచ్చారు.
  • దేశంలో నాయకులకు కొదవ లేదని సార్వత్రిక ఎన్నికల తరువాతే, ప్రధాని ఎవరనేది డిసైడ్ చేస్తామన్నారు.

మోడీపై ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న పోరాటం అలాగే, బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్న కృషి, మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా శరద్ పవార్ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి.

ప్రధాన మంత్రి కిరీటం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరో నెల రోజుల నిరీక్షణ తప్పేలా లేదు.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*