Photo Story : తెలియక చేసిన పాపాలను పోగొట్టుకోవాలా?
Photo Story :

తెలియక చేసిన పాపాలను పోగొట్టుకోవాలా?
తెలిసీ, తెలియక చేసిన పాపాలను పోగొట్టుకోవాలా? అయితే నరసింహ స్వామిని పూజించండి.. అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. పాపాల బారి నుంచి తమను తాము రక్షించుకోవాలంటే.. లక్ష్మీనరసింహ స్వామి వ్రతాన్ని ఆచరించాలని వారు సూచిస్తున్నారు. నరసింహ స్వామినే సర్వస్వం భావించి..”ఓం నమో నారాయణాయః” అనే మంత్రంతో ఆయన్ని జపిస్తే.. సకలదోషాలు, పాపాలు హరించుకుపోతాయి. చేసిన పాపాల నివృత్తి కోసం.. నరసింహ స్వామిని శరణు వేడటం ఉత్తమం.
ఇక లక్ష్మీనరసింహ స్వామి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే.. సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి.. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆపై పూజగదిని శుభ్రం చేసుకుని పువ్వులతో, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. నరసింహ స్వామి పటాన్ని పూజాగదిలో వుంచి.. పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలి. ఇలా వారానికి ఓ రోజు చేయాలి. లేకుంటే ప్రతిరోజూ నరసింహ స్వామి పటం ముందు తూర్పు వైపు నిలబడి నమస్కరించాలి.
రోజూ స్నానమాచరించి తూర్పు వైపు నిలబడి.. రోజూ ”ఓం నమో నారాయణాయః” అనే మంత్రాన్ని 3, 12, 28 సార్లు పారాయణం చేయాలి. కాచిన ఆరబెట్టిన ఆవు పాలను నరసింహ స్వామికి నైవేద్యంగా సమర్పించవచ్చు. స్వామికి సమర్పించిన ప్రసాదాన్ని కుటుంబీకులు తీసుకోవాలి. అలాగే నరసింహ స్వామి వ్రతాన్ని ఆచరించిన వారికి పాపాలు తొలగిపోవడమే కాకుండా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఇంట లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు.. ఆలయానికి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామి నేతి దీపం వెలిగించాలి. తులసీ మాలను స్వామివారికి అర్పించాలి. ఇలా చేయడం ద్వారా రుణబాధలు తొలగిపోతాయి. వ్యాధులు నివారించబడతాయి. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి చేకూరుతుంది. ఉపాధి అవకాశాలు లభిస్తుంది. ఉద్యోగాల్లో ఏర్పడే ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి అష్టోత్తర, లక్ష్మీ నరసింహ స్వామి శతనామావళిని రోజూ పఠిస్తే ఈతిబాధలుండవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Read Also : http://www.legandarywood.com/teaser-bharath-anu-nenu-simply-superb/