Photo-Story : బయోపిక్ ‘యన్.టి.ఆర్’ ఫస్ట్ లుక్
వారాహి చలన చిత్ర సంస్థ, బాలకృష్ణ సంయుక్తంగా :
తన నూరవ చిత్రంలో అమ్మ పేరు ధరించి కూస్తంత మాతృరుణం తీర్చుకున్న బసవ రామ తారక పుత్రుడు, ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృరుణాన్ని కూడా తీర్చుకుంటున్న తారక రామ పుత్రుడు, శతాధిక చిత్ర ‘నటసింహం’, నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని యన్.టి.ఆర్ చిత్ర దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు,

వారాహి చలన చిత్ర సంస్థ, బాలకృష్ణ సంయుక్తంగా
నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న బయోపిక్ ‘యన్.టి.ఆర్’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
కాగా, ఎన్టీఆర్ నటించిన వివిధ చిత్రాల్లోని పాత్రలతో పాటు అవే పాత్రల్లో బాలకృష్ణను చూపించారు. ఈ ఫస్ట్ లుక్ లో బాలకృష్ణ మీసాలకు ఆయన తండ్రి ఎన్టీఆర్ మెరుగులు దిద్దుతున్నట్టు చూపించడం ఆసక్తికరంగా ఉంది. ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని వారాహి చలన చిత్ర సంస్థ, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Also : http://www.legandarywood.com/photo-story-shocking-remuneration/