Photo Story : విపక్ష పార్టీలకు విందు @ సోనియా గాంధీ

Photo Story :

విపక్ష పార్టీలకు విందు @ సోనియా గాంధీ

విపక్ష పార్టీలకు విందు @ సోనియా గాంధీ

 సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేపట్టారు. ఇందులోభాగంగా, ఆమె విపక్ష పార్టీలకు విందు ఇవ్వాలని నిర్ణయించారు.


నిజానికి ఈనెల 16 నుంచి 18వ తేదీల మధ్య ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. దీనికంటే ముందు ఈ నెల 13న విందు సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విందు కార్యక్రమానికి 17 పార్టీలను ఆహ్వానించనున్నట్టు, టీడీపీ ప్రతినిధి కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.


దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ విషయంలో ప్రతిపక్షాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రకాల అంశాలపై కలసికట్టుగా ఉద్యమించేందుకు సోనియా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

 

Read Also : http://www.legandarywood.com/teaser-bharath-anu-nenu-simply-superb/

About the Author

Related Posts

Leave a Reply

*