Poco F4 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎఫ్4 రిలీజ్… 120Hz అమొలెడ్ డిస్‌ప్లే, 64MP OIS కెమెరా, స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్
Poco F4 5G | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎఫ్4 (Poco F4) స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో 120Hz అమొలెడ్ డిస్‌ప్లే, 64MP OIS కెమెరా, స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో మరో మొబైల్ లాంఛ్ చేసింది. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో ఒకేసారి పోకో ఎఫ్4 5జీ (Poco F4 5G) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇందులో 120Hz అమొలెడ్ డిస్‌ప్లే, 64MP OIS కెమెరా, స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇప్పటికే పోకో ఎఫ్ సిరీస్‌లో ఇండియాలో పోకో ఎఫ్3 జీటీ (Poco F3 GT) స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు పోకో ఎఫ్4 వచ్చేసింది. ఆఫర్స్‌తో కలిపి రూ.25,000 బడ్జెట్లో పోకో ఎఫ్4 రిలీజ్ కావడం విశేషం. ఇప్పటికే రూ.25,000 బడ్జెట్‌లో రియల్‌మీ, సాంసంగ్, వివో, ఐకూ, వన్‌ప్లస్ లాంటి బ్రాండ్స్ నుంచి గట్టి కాంపిటీషన్ ఉంది. ఈ కంపెనీల మొబైల్స్‌కు పోకో ఎఫ్4 పోటీ ఇవ్వనుంది.
పోకో ఎఫ్4 ధర, ఆఫర్స్
పోకో ఎఫ్4 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.33,999. జూన్ 27న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం అవుతుంది. పలు లాంఛ్ ఆఫర్స్ ప్రకటించింది కంపెనీ. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. రూ.1,000 ప్రీపెయిడ్ ఆఫర్ కూడా పొందొచ్చు.
ఈ ఆఫర్స్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.23,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.25,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.29,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనేవారికి అదనంగా రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. ఒక ఏడాది వారెంటీతో పాటు మరో ఏడాది ఎక్స్‌టెండెడ్ వారెంటీ లభిస్తుంది. మొదటి రోజు కొనేవారికి డిస్నీ+ హాట్‌స్టార్ ఒక ఏడాది సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఉచితంగా రెండు నెలలు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
పోకో ఎఫ్4 స్పెసిఫికేషన్స్
పోకో ఎఫ్4 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఇందులో 6.67 అంగుళాల ఈ4 అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐకూ నియో 6 ఎస్ఈ, రియల్‌మీ జీటీ నియో 2, వివో ఎక్స్60 లాంటి మోడల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. 10 5జీ బ్యాండ్స్ సపోర్ట్, వైఫై 6, ఎన్ఎఫ్‌సీ ఫీచర్స్ ఉన్నాయి.
పోకో ఎఫ్4 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్స్‌తో 64మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
పోకో ఎఫ్4 స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 11 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. పోకో లాంఛర్ 4.0 సపోర్ట్ కూడా ఉంది.