Prudhviraj passed way due to that cinema got cancelled !
ఎన్టీఆర్ పృథ్విరాజ్ సినిమా అలా చరిత్రలో నిలిచిపోయింది:
నట సార్వభౌముడు స్వర్గీయ ఎన్టీఆర్ | బాలీవుడ్ స్టార్ పృథ్విరాజ్ కపూర్ సినిమా సగంలో ఆగిపోయింది… ఎన్టీఆర్ కు వరసకు బావ అయ్యే విశ్వేశ్వరరావు నిర్మాణంలో ‘కంచుకాగడా’ అనే టైటిల్ తో సినిమా సగం అయిపోయాక… పృథ్విరాజ్ మరణంతో సినిమా ఆగిపోయింది.
అసలు కథలోకి వెళితే ఎన్టీఆర్ | కాంతారావు కంబినేషన్ లో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో హీరోల తండ్రి పాత్ర కోసం ఓ ప్రముఖ నటుడిని సంప్రదించగా పారితోషకం విషయంలో ఒప్పందం కుదరలేదు.
ఆ సమయంలో విశ్వేశ్వరరావుకు | ఆ పాత్రను బాలీవుడ్‌లో నటుడైన పృథ్వీరాజ్ తో చేయిస్తే బావుంటుందని ఆలోచించి… ముంబై వెళ్లి ఆయన్ని కలిశారట. కథ నచ్చిన పృథ్వీరాజ్ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా నటిస్తానని, తెలుగులో డైలాగ్స్ కూడా చెబుతానని కూడా అన్నారట. విశ్వేశ్వరరావు ద్వారా విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ సంతోషపడ్డారు. మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది.
రెండో షెడ్యూల్ ప్రారంభం కావడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో…. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న జమున గర్భవతి కావడం, ఆమె ప్రసవించే సమయానికి పృథ్వీరాజ్ కపూర్ మరణించడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.
అలా రెండు ధ్రువ తారలను వెండి తార మీద చూసుకొనే భాగ్యాన్ని తెలుగు వారు కోల్పోయారని చెప్పాలి.