Puri Jagannadh: పూరి పెళ్లికి తాళిబొట్టు కొనిచ్చిన ప్రముఖ యాంకర్ ఎవరో తెలుసా ?
పూరి జగన్నాథ్ రీల్ లైఫ్‌నే కాదు.. రియల్ లైఫ్ కూడా డైనమిక్ గా ఉంటుంది. ప్రేమకథలు దగ్గర నుండి సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇలా అనేక ట్విస్ట్స్ టర్న్స్ చోటు చేసుకున్నాయి. ఆయన తన భార్య లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లే అయ్యే సమయానికి పూరి జేబులో ఓ ఐదొందలు కూడా లేవు. దీంతో అప్పటికే ఉన్న పరిచయాలతో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు పూరికి సాయం చేశారు. ప్రముఖ యాంకర్ ఝాన్సీ పూరి పెళ్లికి తాళిబొట్టు కొనిచ్చారు. ఇక నటి హేమ వారిద్దరికి పెళ్లి బట్టలు కొని తెచ్చారు.
ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి తాజాగా ఇప్పుడు “చోర్ బజార్” అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో ఆకాశ్ పూరి తనతల్లిదండ్రులకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాల్ని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
దర్శకుడిగా పూరి జగన్నాథ్ కరియర్లో బోలెడు బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే పూరి జగన్నాథ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా అన్నే పుకార్లు బయట వినిపిస్తూ ఉంటాయి. ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారు అని చాలా వదంతులు వినిపించాయి.
అయితే ఇటీవల జరిగిన చోర్ బజార్ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె గొప్పతనం ఏంటో ఆయన అందరి ముందు వివరించారు.
స్టార్ డైరెక్టర్ అని పూరిని ఆయన భార్య పెళ్లి చేసుకోలేదు. చేతిలో చిల్లి గవ్వ లేని టైమ్ లో.. ఆయన వెంట వచ్చేసింది అన్నారు బండ్ల. గుళ్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత పూరీ స్టా్ర డైరెక్టర్ అయ్యారు. అది ఆయన భార్య గొప్పతనం అంటూ బడ్ల స్పీచ్ ఇరగదీశాడు. అంతే కాదు ఇండస్ట్రీ అంతా ఉలిక్కి పడేలా.. ర్యాంపులు, వ్యాంపులు వస్తుంటాయి.. పోతుంటాయి.. అంటూ ఇన్ డైరెక్ట్ గా పూరీకి హితవు పలికే ప్రయత్నం చేశాడు బండ్ల.
భార్య లావణ్యను పూరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా లేపుకొచ్చి గుడిలో తాళి కట్టారు. దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో లావణ్య ప్రేమలో పడ్డారు పూరి. కొన్నాళ్ళు ఆమె చుట్టూ తిరిగి మనసును గెలుచుకున్నారు.
అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న మిత్రుల మద్దతుతో పూరి, లావణ్య వివాహం గుడిలో జరిగింది. ఈ పెళ్ళికి కనీసం తాళిబొట్టు కొనే స్తోమత కూడా పూరికి లేదు. ఆ తాళిబొట్టు అప్పటి స్టార్ యాంకర్ ఝాన్సీ కొనిచ్చారట. ఇక పెళ్లి బట్టలు నటి హేమ కొన్నారట.
పూరి టేకింగ్, డైలాగ్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన హీరోయిజం కి కొత్త అర్థం చెప్పారు. చాలామంది హీరోలను తన సినిమాలతో స్టార్లను చేశారు పూరి. ఒక దశలో స్నేహితులను నమ్మి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. వరుస ప్లాప్స్ తో డీలా పడ్డారు. లో సంపాదించింది అంతా పోయింది.
ఆర్థిక కష్టాల్లోనే ఇస్మార్ట్ శంకర్ మూవీ చేశారు. ఈ చిత్రం అనూహ్యంగా విజయం సాధించింది. పూరి సొంత బ్యానర్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. ఆ దెబ్బతో పూరి కష్టాలు తీరాయి.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ మెగాస్టార్ సినిమాలో నటిస్తున్నారు. చిరు చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో పూరి నటిస్తున్నారు. మలయాళంలో తెరకెక్కిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ లైగర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినమాలో నటిస్తున్నాడు, బాలీవుడ్ హీరోయిన్ హీరోయిన్. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.