Raghunandan: పోలీసుల యాక్షన్‌ బట్టే నా రియాక్షన్‌: రఘునందన్‌

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై నిర్వహించిన మీడియా సమావేశంలో బాలిక పేరు, ఫొటో, ఊరు పేర్లను తాను చెప్పలేదన్నారు. ప్రెస్‌మీట్‌లో వీడియోను ప్రదర్శించారంటూ అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో రఘునందన్‌పై కేసు నమోదైన నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీతో ఆయన మాట్లాడారు.

Raghunandan

Raghunandan

తానూ న్యాయవాదినేనని.. తనకూ చట్టం తెలుసని రఘునందన్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కావాలనే తనపై బురద చల్లుతోందని విమర్శించారు. తానెప్పుడూ బాధితురాలి తరఫునే మాట్లాడతానని.. ఎంఐఎంపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్‌కు ఎందుకు బాధ అని ఆయన ప్రశ్నించారు. సహజ మిత్రులను కాపాడేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని.. దాని పరిధిలో మాత్రమే మాట్లాడానని చెప్పారు. నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో తీసిన వాళ్లపై కేసు పెట్టాలన్నారు. తనపై కేసు విషయంలో పోలీసుల యాక్షన్‌ బట్టే తన రియాక్షన్‌ ఉంటుందని రఘునందన్‌ వ్యాఖ్యానించారు.

 

About the Author

Leave a Reply

*