Raja Raja Chora Latest Hilarious Teaser !
విభిన్నమైన కథనంతో ‘రాజ రాజ చోర’:
శ్రీ విష్ణు | మేఘా ఆకాష్ జంటగా హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తుంది. ఈ సినిమాలో అన్ని రకాల పాత్రలను కవర్ చేస్తూ…. నిత్యానంద ప్రవచనంతో మొదలైన టీజర్ తరువాత శ్రీ విష్ణు రాత్రివేళ చోర కళల నైపుణ్యంతోనూ… పగలు సూటు బూటుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కటింగ్ ఇస్తూ.. హీరోయిన్ తో రొమాన్స్ చేయటం..
రవి బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు, ఒక కేస్ క్లోజ్ చేయడానికిగాను ఒక అమాయకుడైన యువకుడి కోసం వెదుకుతున్న ఆయనకి హీరో తారసపడతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది.
‘రాజాది రాజ.. రాజ మార్తాండ.. రాజ రాజ చోర.. బహు పరాక్.. బహు పరాక్’ అంటూ వచ్చిన ఈ టీజర్ హిలేరియస్ గా ఉంది. దీనికి వివేక్ సాగర్ అందించిన నేపథ్యం సంగీతం.. వేదరామన్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
విప్లవ్ నిషాదం ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి | కాదంబరి కిరణ్ | శ్రీకాంత్ అయ్యంగార్ | అజయ్ ఘోష్ | వాసు ఇంటూరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా…. మేఘా ఆకాష్ కెరియర్ కు ఎంటరకు హెల్ప్ అవుతుంది అనేది చూడాలి.