Logo

Rana : ఇదే నా చివ‌రి చిత్రం అంటూ రానా స్ట‌న్నింగ్ కామెంట్స్

రానా స్ట‌న్నింగ్ కామెంట్స్ :

ద‌గ్గుబాటి వారసుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన రానా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. కేవ‌లం హీరోగానే కాకుండా విల‌న్‌గాను స‌త్తా చాటుతున్నాడు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం విరాట ప‌ర్వం ఈనెల 17న విడుద‌ల కానుండ‌గా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రానా షాకింగ్‌ కామెంట్స్ చేశారు.

రానా షాకిచ్చాడుగా..
`విరాటపర్వం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రానా మాట్లాడుతూ, విరాటపర్వం ఈవెంట్‌కి వచ్చిన వెంకటేష్‌కి థ్యాంక్స్ చెప్పారు. ఆయన లేకుండా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం కూడా జరగదని తెలిపారు. అనంతరం ఇక్కడున్న సాయిపల్లవి ఫ్యాన్స్ అందరికి వెల్‌కమ్‌ అని చెప్పగానే ప్రాంగణం మారుమోగింది. కాసేపటి వరకు అరుపులు వినిపించాయి.

దీంతో సాయిపల్లవి పవర్‌ అంటే ఇది అని రానా కితాబిచ్చారు. ఇందులో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు రానా. రామ్‌చరణ్‌ ఈ ఈవెంట్‌కి రావాల్సి ఉండగా, ఆయన ఫ్లైట్‌ మిస్‌ అయ్యి హైదరాబాద్‌కి రాలేకపోయారని తెలిపారు. ఆయన తరఫున ఫ్యాన్స్ కి తాను సారీ చెబుతున్నానన్నారు. రామ్‌చరణ్‌ తన పెళ్లి రోజు సందర్భంగా భార్య ఉపాసనతో ఇటలీలో విహరిస్తున్న విషయం తెలిసిందే.

ద‌గ్గుబాటి Rana

ద‌గ్గుబాటి Rana

అనంతరం రానా మాట్లాడుతూ, దర్శకుడు వేణుపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఎంతో నిజాయితీతో తీసిన చిత్రమిది అని తెలిపారు. తను పెరిగిన ఊర్లలో, పెరిగిన పరిస్థితుల్లో నుంచి ఒక భయంకరమైన బ్యాక్‌డ్రాప్‌లో ఒక అద్భుతమైన ప్రేమకథని తెరకెక్కించారు. ఈ కథకి తనని ఎంచుకున్న వేణుకి ధన్యవాదాలు చెప్పారు. ఆ భయంకరమైన బ్యాక్‌ డ్రాప్‌లో బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీ ఉందని, అది సాయిపల్లవితో ఉన్న లవ్‌ స్టోరీ అని చెప్పారు.

సాయిపల్లవి నడుస్తుంటే వెన్నెల పక్కన తిరుగుతున్నట్టు ఉంటుంది. ఈ సినిమాలో ఎవరు ఉన్నా లేకున్నా సాయిపల్లవి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదన్నారు రానా. ఆమెతో పనిచేయడం గౌరవంగా ఉందన్నారు. ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ తో పనిచేయడం ఆనందంగా ఉందని, ఫస్ట్ టైమ్ ఎలాంటి గాయలు లేకుండా చేశామని, ఇకపై కూడా ఇలానే గాయలు లేకుండా ఆయనతో కలిసి సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు రానా.

అనంతరం రానా చెబుతూ పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు తనకు విక్టరీ వెంకటేష్‌గారి ఫ్యాన్సే ఉంటారనుకున్నా, నాకు సెపరేట్‌గా ఫ్యాన్స్‌ ఉంటారనుకోలేదు. నాకేదో సినిమాలు నచ్చి, కొత్త కొత్త కథలు చెప్పాలనుకుంటూ డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ వచ్చాను. కానీ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు ఎంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారో అర్థమైంది. ఎందుకంటే ఇలాంటి సినిమాని చేయోద్దని వారు నాకు తెలిపారు. ఇదే నా చివరి ప్రయోగం. ఇకపై మీకోసం(ఫ్యాన్స్) సినిమాలు చేస్తా. ఇకపై పిచ్చెక్కిద్దాం` అని తెలిపారు రానా.

About the Author

Leave a Reply

*