ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రణ్వీర్ సింగ్ !

ఇస్మార్ట్ శంకర్ హిందీ లో రీమేక్… హీరో గా కండల వీరుడు:

ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్’ డాషింగ్ డైరెక్టర్ ‘పూరి’ జగన్నాథ్ కాంబినేషన్ లో మాస్ ఎంటర్టైనర్ జోనర్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ను బాలీవుడ్ లో తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

అలాగే…బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ పాత్రలో రణవీర్ సింగ్ ను తీసుకున్నారు.

ఈ సినిమాను మక్కి కి మక్కి కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు అనుగుణం గా కొన్ని మార్పులు చేయనున్నారు. దీని కోసం ప్రస్తుతం గడ్డం పెంచుకుని గెటప్ మొత్తం చేంజ్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతున్నట్లు బి-టౌన్ లో ఇన్సైడ్ టాక్.

ఈ సవంత్సరం ప్రథమార్ధం లో టాలీవుడ్ లో మంచి విజయాలు అందుకున్న ‘జెర్సీ | అలా వైకుంఠపురం లో’ లాంటి సినిమాలను కూడా బాలీవుడ్లో తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రణ్వీర్ సింగ్ పరకాయ ప్రవేశం చేస్తే అభిమానులకు పూనకాలే అనటంలో ఎటువంటి సందేహం లేదు.

About the Author

Leave a Reply

*