మూషికుని చేతిలో నగర వాసులు విల విల !

డ్రైనేజీలో మూషికం….నగర వాసుల పాలిట నరకం:

సాధారణంగా ఎలుక సైజు చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. కానీ ఈ చనిపోయిన ఎలుక చాలా భారీ కాయంతో ఉండటంతో ‘మెక్సికోలో’ అందరు షాక్ కి గురయ్యారు.

అయినా ఇంత పెద్ద ఎలుక ఎక్కడైనా ఉంటుందా అనే సందేహం వచ్చినా కూడా అది ఎలుకే అని అనౌన్స్ చేసేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

అసలు విషయానికి వస్తే….మెక్సికోలో గత కొన్నిరోజులుగా డ్రైనేజీలు బ్లాక్ అవుతున్నాయి. దీంతో మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీలను తనిఖీ చేయడం ప్రారంభించారు. మొత్తానికి బ్లాక్ అవ్వడానికి కారణాన్ని కనిపెట్టారు.

హాలోవిన్ నేపథ్యంలో ఎవరో పెద్ద సైజు ఎలుక బొమ్మను తయారు చేసి డ్రైనేజీలో పడేశారు. దీన్ని చూసి ఎలుక అని ప్రసారం చేశారు. దీనిని చూడడానికి అక్కడ సిబ్బంది పెద్ద ఎత్తున వచ్చారు. తీరా ఆ ఎలుకని బయటకి తీసి శుభ్రం చేసి పరిశీలించాక గాని తెలియలేదు అది నిజం ఎలుక కాదు.. బొమ్మ అని.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

About the Author

Leave a Reply

*