‘ఆర్‌కామ్’ చూపు ‘దివాలా’ వైపు !
‘ఆర్‌కామ్’ చూపు ‘దివాలా’ వైపు:
అడాగ్ గ్రూప్‌నకు చెందిన ‘ఆర్‌కామ్’ దివాలా దిశగా అడుగులు వేస్తుంది ఆర్‌కామ్‌కు వచ్చిన పన్ను రీఫండ్స్‌ను బ్యాంక్ నుంచి విడుదల చేయించుకొని అప్పులు చెల్లించకపోతే కోర్టు ‘దివాలా’ పరిష్కార ప్రక్రియకు పంపే అవకాశం ఉంది.
చెల్లింపులు పూర్తి చేయకపోతే ‘దివాలా’ పరిష్కార ప్రక్రియ నిలిపివేస్తూ ఇచ్చిన ‘ఆదేశాల’ను ఉపసంహరించుకొంటాము. అని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ వెల్లడించింది.

‘ఆర్‌కామ్’ చూపు ‘దివాలా’ వైపు
మంగళవారం ఇద్దరు సభ్యుల ట్రైబ్యునల్ ఈ కేసును విచారించింది. దీనికి జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయ నేతృత్వం వహిస్తున్నారు. బ్యాంకులో ఉన్న రూ. 260 కోట్ల పన్ను రీఫండ్ మొత్తాన్ని విడుదల చేయాలని కోరిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
మరోపక్క ఆర్‌కామ్ ‘మార్చి 19’ నాటికి స్వీడిష్ కంపెనీ ఎరిక్సన్‌కు ‘రూ. 453 కోట్లు’ చెల్లించాల్సి ఉంది. లేకపోతే అనిల్ అంబానీ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
Read Also: https://www.legandarywood.com