Remedesiver get dismiss in soon @ WHO!

కోవిడ్ చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ దూరం :

భారత వైద్య పరిశోధన మండలి సూచనల ప్రకారం…. రెమ్ డెసివిర్ ఔషధాన్ని త్వరలోనే తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నాణేనికి ఒకవైపు తమిళనాడు ప్రభుత్వమైతే చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అందిస్తోంది. ఇసుకపోస్తే రాలనంతమంది క్యూలో నిల్చుంటూ దానిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.

మరొకవైపు రెమ్‌డెసివిర్ మందులు అసలు దొరకడం లేదు. చాలా చోట్ల వీటిని బ్లాక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే… కరోనా రోగులకు చాలా మంది డాక్టర్లు రెమ్‌డెసివిర్ రాసేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రెమ్‌డెసివిర్ ప్రాణాలను కాపాడగలదు అనేందుకు ఆధారాలు లేవు అని చెప్పింది.

గంగారామ్ హాస్పిటల్ చైర్ పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ చికిత్సలో భాగంగా అందిస్తున్న రెమ్‌డెసివిర్ ఆశించిన మేర ఫలితాలను ఇవ్వడం లేదని, అందువల్ల రెమ్‌డెసివిర్‌ను కోవిడ్ చికిత్స ప్రోటోకాల్ నుంచి తొలగించే అవకాశం ఉందని అన్నారు.

అయితే… మన దేశంలో రెమ్‌డెసివిర్‌ను సిప్లా | డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ | హెటిరో | జుబిలంట్ ఫార్మా | మైలాన్‌ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటికి పేటెంట్ దారు గిలియాడ్ లైఫ్ సైన్సెస్ ఉత్పత్తికి అనుమతులు ఇచ్చింది.

తాజాగా ‘రెమ్‌డెసివిర్’ కోవిడ్ చికిత్సలో ఎటువంటి ప్రభావం చూపకపోవటంతో…వాటిని రద్దు చేస్తారని క్లారిటీ ఇచ్చారు.

About the Author

Leave a Reply

*