Rock-Sugar gives speechless relief to the human !

పటిక బెల్లం సర్వ గుణాల దివ్యోషధం:

నూతన జీవనశైలి మనుషుల్లోని పురుషత్వాన్ని చంపేస్తుంది. ఒత్తిడి జీవితంలో పడి… అందరూ సంసారం సుఖానికి దూరం అవుతున్నారు. వారానికో… నెలకో ఒకసారి శృంగారం చేసుకునేంత ఒత్తిడిలో జనాలు పడిపోయారు. అయితే తీవ్రమైన పని ఒత్తిడి… వ్యసనాలతో శృంగార సామర్థ్యం పడిపోతుంది. వీర్య కణాల సంఖ్య తగ్గి సంతాన లోపాలు సమాజంలో పెరిగిపోతున్నాయి.

తాజా పరిణామాలతో…మన ఇంట్లో దొరికే పదార్థం ‘పటిక బెల్లం లేదా కలకండ’ దివ్య ఓషధంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పటిక బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. పటిక బెల్లంలో విటమిన్లు ఖనిజాలు అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం మాంసాహారంలో దొరికే విటమిన్ బి12 పటిక బెల్లంలో ఎక్కువ మొత్తంలో దొరుకుతుంది.

పటిక బెల్లం మగవారిలో వీర్య కణాల నిష్పత్తిని తగిన స్థాయిలో మెరుగుపరుస్తుంది | శుక్రకణాల ఉత్పత్తిని పెంచుతుంది. పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు పటిక బెల్లం కలిపిన పాలు తాగడం ఆరోగ్యకరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా వీర్యవృద్ధితోపాటు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసే పటిక బెల్లంను మీరు వాడి అనారోగ్యాలను దూరం చేసుకోండి.

అరటిపండును పటికబెల్లం పొడితో అద్దుకొని తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు త‌గ్గుతాయి.
పటికబెల్లం పొడిని, పసుపు పొడిని నిప్పుల మీద చల్లి దాని వాసన రెండు పూటలా పీలుస్తూ ఉంటే జలుబు, పడిశం వంటివి తగ్గిపోతాయి.

* పటికబెల్లం పొడి 3 గ్రాములు, ఒక టీ స్పూన్ పుదీనా ఆకుల రసం కలిపి రోజూ రెండు లేక మూడు పూటలు సేవిస్తూ ఉంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి

* నోటి పుండు ఉంటే, ఏలకులతో పటిక బెల్లం కలపడం ద్వారా పేస్ట్ తయారు చేసి, ప్రతిరోజూ ఉదయం నీటితో కలిపిన ఈ పేస్ట్ త్రాగాలి. ఇలా చేయడం ద్వారా నోటి బొబ్బలు మాయమవుతాయి.

* వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి రెండు లేక మూడు పూటలు తాగితే అతిగా మాట్లాడటం వలన వ‌చ్చే గొంతు బొంగురు తగ్గిపోతుంది.

* నిమ్మపండు ముక్క మీద కొద్దిగా పటికబెల్లం పొడి అద్ది బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే వాంతులు తగ్గిపోతాయి.

* మీరు భోజనం చేసిన తరువాత నోరు కడుక్కోకపోయినా, నోరు పుక్కిలించకపోయినా, ఆ బాక్టీరియా చిగుళ్ళ సందుల్లో ఉండిపోయి చెడు వాసన కలిగిస్తుంది. భోజనం తరవాత తింటే ఈ చెడు వాసన పోగొట్టి , తాజా శ్వాస నింపుతుంది.

ఇలా పటిక బెల్లం మగవారిలో వీర్య కణాల వృద్ధితో పాటు…పిల్లల ఎదుగుదల…ఇంకా నానా రకాల అనారోగ్యాలను దూరం చేస్తుంది.

About the Author

Leave a Reply

*