Sammathame Twitter Review: సమ్మతమేకు అలాంటి టాక్.. కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే!

కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లలో కిరణ్ అబ్బవరం ఒకడు. ‘రాజావారు రాణిగారు’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అలాగే, గత ఏడాది ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ అనే సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘సమ్మతమే’ అనే సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్యూర్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? దీనిపై ట్విట్టర్‌లో నెటిజన్లు ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు? అనేవి చూద్దాం పదండి!

సమ్మతమే అంటూ వచ్చిన కిరణ్ టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రమే ‘సమ్మతమే’. గోపీనాథ్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించింది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కనకాల ప్రవీణ నిర్మించారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలను చేసిన విషయం తెలిసిందే.

అంచనాలు పెంచిన అప్‌డేట్స్ ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన ‘సమ్మతమే’ మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు. కానీ, ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో కిరణ్ నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయని చెప్పుకోవచ్చు.

బిజినెస్‌కు తగ్గట్లుగానే విడుదల కిరణ్ అబ్బవరంకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ మూవీ హిట్ అవడంతో ‘సమ్మతమే’కి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా హక్కులు డీసెంట్ రేట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జీఏ2 సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందుకు అనుగుణంగానే దీన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

సమ్మతమేకు టాక్ ఎలా ఉంది? కిరణ్ అబ్బవరం నటించిన ‘సమ్మతమే’ మూవీ బ్రేకప్ లవ్ స్టోరీ నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు మిశ్రమ టాక్ వచ్చింది. గతంలో చాలా సినిమాల్లో చూసిన కాన్సెప్టే అయినా చాలా ఫ్రెష్‌గా చూపించారని ట్విట్టర్‌ ద్వారా కామెంట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలాగ ‘సమ్మతమే’ మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం.. హీరో, హీరోయిన్ ప్రేమలో పడడం వంటి వాటితో ఫన్నీగా సాగిపోతుందట. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంటుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం లాజిక్‌లకు దూరంగా, కాస్త ఎమోషనల్‌గా సాగుతుందని అంటున్నారు. అయితే, క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని టాక్.

సినిమాలో ప్లస్‌.. మైనస్‌లు ఇవే ‘సమ్మతమే’ మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి నటన.. కామెడీ సీన్స్.. నేపథ్య సంగీతం.. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ సినిమాలో హైలైట్‌ అయిన అంశాలని తెలుస్తోంది. అయితే, స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదించడంతో పాటు ఎమోషనల్ సీన్స్‌లో ఫీల్ మిస్ అవడం మైనస్‌గా మారాయని ప్రేక్షకులు అంటున్నారు.

Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood

About the Author

Leave a Reply

*