రకుల్..రాశి ఖన్నా..రెజీనా విషయంలో అది నిజం కాదు!: సందీప్ కిషన్

ఒకప్పుడు చంద్రమోహన్ సరసన చేస్తే హీరోయిన్స్ దశ తిరిగేది  ఇప్పుడు ఆ ప్లేస్ లో సందీప్ కిషన్ పేరు  ఆ సెంటిమెంట్ పై నమ్మకం లేదు  కష్టపడ్డారు గనుకనే స్టార్స్ అయ్యారు  ఒకప్పుడు చంద్రమోహన్ సరసన నటించిన చాలామంది కథానాయికలు ఆ తరువాత స్టార్స్ అయ్యారు. అలా స్టార్స్ అయిన కథానాయికల జాబితా పెరగడంతో, ఆయనతో కలిసి నటిస్తే హీరోయిన్స్ దశ తిరిగిపోతుందనే సెంటిమెంట్ ఉండేది. అదే సెంటిమెంట్ సందీప్ కిషన్ విషయంలోను ఇప్పుడు రిపీట్ అవుతోందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రకుల్ .. రాశి ఖన్నా .. రెజీనా .. వీళ్లంతా సందీప్ కిషన్ తో చేసిన తరువాతనే కెరియర్ పరంగా దూసుకెళ్లడం ఈ ప్రచారానికి కారణమైంది. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి ప్రస్తావించగా, సందీప్ కిషన్ తనదైన శైలిలో స్పందించాడు. “ఆ హీరోయిన్స్ అంతా జన్యూన్ గా హార్డ్ వర్క్ చేశారు .. అందువల్లనే స్టార్స్ అయ్యారు. వాళ్లు స్టార్స్ కావడానికి .. ఈ సెంటిమెంట్ కారణమంటే నేను నమ్మను. ఒకవేళ అంతా అదే నిజమంటే మంచిదే కదా” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Also: http://www.legandarywood.com/latest-news-updates/

About the Author

Leave a Reply

*