ప్లాట్ ఫామ్ టికెట్ బాదుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం !

ప్లాట్ ఫామ్ టికెట్ బాదుడు…కొంచెం ఇష్టం కొంచెం కష్టం:

దేశంలో లాక్ డౌన్ ముగియడంతో దాదాపుగా అన్ని రంగాలు తమ సేవలను కొనసాగిస్తున్నాయి. ఇక ఈరోజు నుంచి అంటే ‘సెప్టెంబర్ 12’ నుంచి 80 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. ప్లాట్ ఫామ్ ధరలు పెంచింది.

గతంలో ఈ ధరలు రూ.10లు ఉండగా.. ఇప్పుడు రూ.50లకు పెంచింది. అయితే ఈ ధరలు తాత్కాలికంగా పెంచినవి మాత్రమేనని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారిక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం బెంగళూరులోని కేఎస్‌ఆర్ బెంగళూరు | బెంగళూరు కంటోన్‌మెంట్‌ | యశ్వంత్‌పూర్ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌లో.. ఇకపై ఫ్లాట్‌ఫామ్‌ల ధర రూ.50లుగా వసూలు చేయనున్నారు.

అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో…క్లోన్ ట్రైన్స్ ను…నడుపుతామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ప్రకటించి… ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు.

About the Author

Leave a Reply

*