Sperm is a big challenge in coming years !
వచ్చే కొన్నేళ్లలో మానవ మనుగడకు ‘స్పెర్మ్’ ముప్పు:
నేటి ఆధునిక సమాజంలో మానవుడు సాధించిన విజయాలే తనపాలిట మరణమృదంగంగా సంభవిస్తున్నాయి…. అవే తుఫాన్, భూకంపం, అంతులేని రోగాలు… ఇలా చెప్పుకొంటూ పొతే కోకొల్లలు. తాజాగా ‘ఏపిడెమియాలజిస్ట్’ అవార్డ్ విన్నింగ్ శాస్త్రవేత్త షన్నా స్వాన్ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు.
ప్రాణుల పుట్టుకకు కీలకమైన స్పెర్మ్ కౌంట్ (వీర్యం లభ్యత) తగ్గుదల సవాలుగా మారింది. వచ్చే 40 ఏళ్లలో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య 50 శాతానికి పైగా పడిపోయే అవకాశం ఉందని….కౌంట్‌డౌన్’ అనే పుస్తకంలో వివరించారు.
2045 నాటికి సంతానోత్పత్తి కోసం చాలా జంటలు సహజ శృంగార ప్రక్రియకు బదులు ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉందని స్వాన్ చెప్పుకొచ్చారు.
2060 నాటికీ గర్భానికి అవసరమయ్యే కణాలు మెజారిటీ పురుషుల్లో ఉండవని ఆమె తేల్చి చెప్పారు. ఇది ఒక్క మానవ జాతిలోనే కాదు అన్ని జంతువుల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
ఇప్పుడే మనం మేల్కొనకపోతే…జరిగే అనర్థం సర్వ జగత్తుకు వినాశకరంగా మారుతుంది. ప్రధానంగా వీర్యకణాలు తగ్గడానికి కారణం రసాయనిక ఎరువులే అని తేట తెల్లం కావటం కొసమెరుపు.