Srinidhi Shetty : కెజియఫ్ హీరోయిన్ సమస్య అదేనా.. అందుకే కొత్త సినిమాలు లేవా..
Srinidhi Shetty : కెజియఫ్ సినిమా పాపులారిటీ ఏంటో తెలియంది కాదు.. ఆ సినిమాలో నటించిన యష్ ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఓ రేంజ్‌లో దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నారు. దీంతో ఆయనకు వరుసగా సినిమాలు వస్తున్నాయి. అయితే ఆ సినిమాలో హీరోకు వచ్చిన క్రేజ్, ఆ పాపులారిటీలో ఎంతో కొంత హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా వచ్చింది.
కెజియఫ్ సినిమా పాపులారిటీ ఏంటో తెలియంది కాదు.. ఆ సినిమాలో నటించిన యష్ ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఓ రేంజ్‌లో దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నారు. దీంతో ఆయనకు వరుసగా సినిమాలు వస్తున్నాయి. అంతేకాదు ఓ రేంజ్‌లో రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ సినిమాలో హీరోకు వచ్చిన క్రేజ్, ఆ పాపులారిటీలో ఎంతో కొంత హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా వచ్చింది.
హీరోయిన్స్ ఏదైనా సినిమా హిట్ అయితే ఓ అరడజను భాషల్లో ప్రాజెక్టులను ఓకే చేస్తుంటారు. ఒక సినిమా హిట్ అయితే వారికి చకచకా నాలుగు అయిుదు భాషల నుంచి అవకాశాలు వస్తుంటాయి. దాంతో ఆ డిమాండ్ కి తగినట్టుగానే వీళ్లు పారితోషికాన్ని పెంచేస్తూ ఉంటారు. ఆ కోవలో శ్రీనిధి శెట్టి కూడా భారీగా పారితోషికాన్ని పెంచారు. ఇటీవల వచ్చిన ‘కేజీఎఫ్ 2’ కూడా సంచలన విజయాన్ని సాధించడంతో పారితోషికాన్ని మరింత పెంచారట ఆమె.
హీరోయిన్స్ ఏదైనా సినిమా హిట్ అయితే ఓ అరడజను భాషల్లో ప్రాజెక్టులను ఓకే చేస్తుంటారు. ఒక సినిమా హిట్ అయితే వారికి చకచకా నాలుగు అయిుదు భాషల నుంచి అవకాశాలు వస్తుంటాయి. దాంతో ఆ డిమాండ్ కి తగినట్టుగానే వీళ్లు పారితోషికాన్ని పెంచేస్తూ ఉంటారు. ఆ కోవలో శ్రీనిధి శెట్టి కూడా భారీగా పారితోషికాన్ని పెంచారు. ఇటీవల వచ్చిన ‘కేజీఎఫ్ 2’ కూడా సంచలన విజయాన్ని సాధించడంతో పారితోషికాన్ని మరింత పెంచారట ఆమె.
అయితే ఇంతవరకూ ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. ‘కెజియఫ్’ హిట్ లో ఆమె పాత్ర కూడా చాలా తక్కువే. అయినా ఆమె తన పారితోషికాన్ని ఒక రేంజ్ లో పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. దీంతో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.. రెమ్యూనరేషన్ ఓ రేంజ్‌లో ఉండడంతో నిర్మాతలు కష్టమే అంటూ మరోక హీరోయిన్‌ను వెతుక్కుంటున్నారట.
దీంతో దేశవ్యాప్తంగా శ్రీనిధి శెట్టికి పాపులారిటీ వచ్చిన ఆమె కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి ఇదే అసలు సమస్య అని అంటున్నారు. అయితే ఆ మధ్య తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న లైగర్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో శ్రీనిధి శెట్టిని అడిగారట.. కానీ ఆమె ఓ రేంజ్‌లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో.. నిర్మాతలు లైట్ తీసుకున్నారని వినిపించింది.
ఇక ఆమె నటించిన కెజియఫ్ సినిమా విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టమీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు.
ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా బాహుబలి-2 (Baahubali 2) రికార్డును బ్రేక్ చేసిందని అంటున్నారు. ఈ సినిమా ఇప్పటికే రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా.. తాజాగా కెజియఫ్ 2 బుక్ మై షో (Book my show) బుకింగ్స్‌లో అత్యధిక టికెట్లు కొనుగోళ్లు జరిపిన సినిమాగా ఆల్‌టైమ్ న్యూ రికార్డ్ సృష్టించింది.
కెజియఫ్ రెండో పార్ట్ 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా 253.51 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ రేంజ్‌లో బహుబలి సిరీస్ తర్వాత ఈ సినిమానే ఆ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మూడో పార్ట్ కూడా రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇక మూడో భాగంలో రాఖీ భాయ్ ఇంటర్నేషనల్ లెవల్‌లో పవర్ చూపించనున్నాడట. పార్ట్ 3లో (KGF Chapter 3) రాఖీ భాయ్ సామ్రాజ్యం అమెరికాలోనూ విస్తరించనుందని టాక్.
ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt), రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశారు. కన్నడ నటి శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇక కెజియఫ్ చాఫ్టర్ 3 ప్రాజెక్టు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ చేస్తున్నారు. అది పూర్తవ్వగానే ఈ సినిమా ఉండనుందట