‘టిక్ టాక్’ను ‘నిషేదిం’చాలని సుప్రీం ‘ఆదేశం’ !

‘టిక్ టాక్’ యాప్ ను ‘నిషేదిం’చాలని సుప్రీం ‘ఆదేశం’:

సోషల్ మీడియాలో బాగా పాపులరైన టిక్ టాక్ యాప్ ను ప్లే-స్టోర్ నుంచి తొలగించాలని న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది.

చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్‌ యాప్‌పై సర్వత్రా విమర్శలు రావటంతో, దీనిని నిషేదించాలని మదురైకి చెందిన సీనియర్‌ న్యాయవాది | సామాజిక కార్యకర్త ముత్తు కుమార్‌ మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశారు.

 

'టిక్ టాక్' యాప్ ను 'నిషేదిం'చాలని సుప్రీం 'ఆదేశం'

‘టిక్ టాక్’ యాప్ ను ‘నిషేదిం’చాలని సుప్రీం ‘ఆదేశం’

 

దీనిపై విచారణ అనంతరం… దీనిని నిషేదించాలని న్యాయస్థానం కేంద్రాన్ని కోరింది. ఈ యాప్ లో అశ్లీలత । ఆత్మ హత్యలను ప్రేరేపించేలా ఉండటంతో పాటు, తాజాగా తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్ రోహిణి పర్సనల్ ఫోటోలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సినిమా పాటలతో యాడ్ చేసి టిక్ టాక్ యాప్ లో పోస్టు చేశారు, తదితర కారణాలతో ఈ యాప్ ను నిషేదించారు.

మద్రాసు హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ టిక్‌ టాక్‌ సంస్థ, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టేకు నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను ‘ఏప్రిల్‌ 22’న జరుపుతామని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాప్‌లలో గూగుల్ । ఆపిల్ తర్వాత టిక్ టాక్ 3 వ స్థానంలో కొనసాగుతోంది.  ఇందులో ఖాతాదార్లుగా 88.6 మిలియన్ యూజర్లు ఉన్నారట, ఇప్పటికే యూఎస్ | యూకే | హాంకాంగ్ | ఇండోనేషియా దేశాల్లో ఈ యాప్‌లపై పూర్తిగా నిషేధం ఉంది.

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Leave a Reply

*