స్వీట్ 60 హీరోలు

స్వీట్ 60 హీరోలు :

 

స్వీట్ 60 హీరోలు

స్వీట్ 60 హీరోలు

 

టాలీవుడ్ వెటరన్ హీరోలు ఇంకా రేసులో మేమూ ఉన్నామంటూ వెండితెర మీద వెలిగిపోతున్నారు. యంగ్ డైనమిక్ హీరోలతో సరిసమానంగా హిట్లు కొట్టేస్తున్నారు. మధ్యలో కొద్దికాలం వెటరన్లకు కష్టకాలం వచ్చినా ఇప్పుడు మళ్లీ వెటరన్లకు కూడా ఆదరణ బాగానే దక్కుతోంది. తాజాగా రాజశేఖర్ హీరోగా వచ్చిన గరుడవేగ సూపర్ హిట్ కావడమే అందుకు ఉదాహరణ. ఒకప్పుడు యాంగ్రీ యంగ్మెన్ క్యారెక్టర్లకు పెట్టింది పేరైన రాజశేఖర్ కు గత దశాబ్ద కాలంలో చెప్పుకోదగ్గ ఓ హిట్ కూడా ఇవ్వలేకపోయారు. కానీ… గరుడవేగ చూసినవారు మాత్రం రాజశేఖర్ పనైపోయింది అన్న మాట అనలేకపోతున్నారు.

మిగతా సీనియర్ హీరోలూ గాడిలోనే ఉన్నారు. రాజకీయాల కారణంగా దాదాపు పదేళ్లు సినిమారంగానికి దూరమైన మెగాస్టార్ .. తన కెరీర్లో 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి దాదాపు 150 కోట్లు వసూలు చేసి ఇండస్ర్టీలో ఇంకా తనకు ఇమేజి ఉందని నిరూపించుకున్నారు. మరోవైపు మెగాస్టార్ కు సమకాలికుడైన నందమూరి బాలకృష్ణ ఐదుపదుల వయస్సు దాటిన తరువాత తన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా వంద కోట్ల వసూళ్లు సాధించి తానింకా కుర్రహీరోనేనని చాటుకున్నారు.

తన తనయులు హీరోలుగా వరుస సినిమాలు చేస్తున్న టాలీవుడ్లోనే విభిన్న పాత్రలు పోషిస్తూనే..తాను ఇంకా సోగ్గాడినే అని నిరూపించుకున్నారు నాగార్జున.  సోగ్గాడినే చిన్నినాయన – ఊపిరి వంటి సినిమాలు హిట్ అయ్యాయి. ఇలా 60కి అటూఇటూగా ఉన్న మన సీనియర్ హీరోలు ఇంకా కుర్ర హీరోలతో సై అంటున్నారు.

 

Read Also : http://www.legandarywood.com/anasuya-sets-fashion-goals/

About the Author

Leave a Reply

*